సహచరుడు సంతాప సభలో భోరున ఏడ్చేసిన మంత్రి తుమ్మల

ఆత్మీయుడు గాదె సత్యం సంతాప సభలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కన్నీటి పర్యంతమయ్యారు.;

Advertisement
Update:2025-03-13 19:48 IST

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు భోరున ఏడ్చేశారు. సహచరుడు, ఆత్మీయుడు గాదె సత్యం సంతాప సభలో మంత్రి తుమ్మల కన్నీటి పర్యంతమయ్యారు. తనకు గాదె సత్యం ఎంతో సహకారం అందించారని పేర్కొన్నారు. సత్యం మృతి బాధాకరమని కంటతడి పెట్టారు. ఆయన సలహాలు, సూచనలకు అనుగుణంగా తన రాజకీయ నడవడిక జరిగిందని తెలిపారు. ఆయన లేకపోవడం తన భవిష్యత్తు రాజకీయాలకు, వ్యక్తిగతంగా కూడా తీరని లోటు అని మంత్రి అన్నారు.

ఆత్మీయుడు గాదె సత్యం ఆలోచనలతో ముందు వెళ్తానని వివరించారు. నన్ను నిర్దేశించి, పంపించి ఈ రోజు వరకు అన్నీ తానై నడిపినటువంటి సత్యం నన్ను వదిలి పెట్టి వెళ్లటం చాల బాధాకరమని తుమ్మల అన్నారు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. మంచంలో ఉన్నా కూడా నాకు సలహా ఇచ్చేటువంటి శక్తి ఆయనకు తప్ప మరెవరికీ లేదు. ఆయన సలహా ప్రకారమే నా రాజకీయ నడవడిక జరిగింది. ఈ రోజు ఆయన లేకపోవడం నా భవిష్యత్​ రాజకీయాలకు, నాకు తీరని లోటు మంత్రి తుమ్మల భావోద్వేగానికి గురయ్యారు.

Tags:    
Advertisement

Similar News