వేసెయ్ దోశ, చేసెయ్ అమెరికా..

కేఏ పాల్ తోపాటు వచ్చినవారు కూడా ఆహా ఓహో అంటూ ఆయనపైనే సెటైర్లు పేల్చారు. మునుగోడుని అమెరికా చేసేయండి అంటూ వారు కూడా వంత పాడారు.

Advertisement
Update:2022-10-19 19:31 IST

మునుగోడు సీటు కోసం టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ సీరియస్‌గా ట్రై చేస్తుంటే.. ఆ సీటు తనదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. మునుగోడులో వెరైటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. స్థానికంగా ఓ టిఫిన్ షాపులోకి వెళ్లి ప్రచారం నిర్వహించారు. టిఫిన్ షాపు నిర్వాహకుడి ఇద్దరు పిల్లల చదువు బాధ్యత తానే తీసుకుంటానన్నారు. కేజీ టు పీజీ ఉచితంగా చదివిస్తానని హడావిడి చేశారు. ఇద్దరు పిల్లల చదువుకి 17లక్షలు ఖర్చు పెడతానన్నారు. అక్కడే దోశ వేస్తూ మునుగోడుని అమెరికా చేసిపారేస్తానంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు. అందరూ తనకు సహకరించాలన్నారు.

ఉద్యోగాలే ఉద్యోగాలు..

మునుగోడులోని నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెబుతున్నారు కేఏ పాల్. ఏడు మండలాల్లో ఏడు వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చారు. నిరుద్యోగులంతా తనకు మద్దతివ్వాలన్నారు. తొలి విడతలోనే అందరికీ ఉద్యోగాలు ఇచ్చేస్తానని, అర్జెంట్ గా తనని ఎమ్మెల్యేగా గెలిపించండని పిలుపునిచ్చారు.

పాల్.. ఆహా ఓహో..

కేఏ పాల్ తోపాటు వచ్చినవారు కూడా ఆహా ఓహో అంటూ ఆయనపైనే సెటైర్లు పేల్చారు. మునుగోడుని అమెరికా చేసేయండి అంటూ వారు కూడా వంతపాడారు. డాక్టర్ కేఏ పాల్ అనే యాప్ ఉందని, అందరూ దాన్ని సెల్ ఫోన్లలో ఇన్ స్టాల్ చేసుకోవాలన్నారు పాల్. గతంలో హెలికాప్టర్ గుర్తుతో ఏపీ ఎన్నికల్లో రచ్చ చేసిన పాల్ కి ఈసారి ఉంగరం గుర్తు వచ్చింది. ప్రజాశాంతి పార్టీకి స్థిరమైన గుర్తంటూ లేకుండా పోయింది. అసలు పార్టీ గుర్తింపే రద్దయ్యే ప్రమాదంలో పడింది. అయినా కూడా పాల్ కామెడీ ఆగట్లేదు. మునుగోడులో సీరియస్ గా జరుగుతున్న ప్రచారంలో కేఏ పాల్ ప్రజలకు కాస్త రిలీఫ్ ఇస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News