ఏపీలో అర్చకులకు శుభవార్త.. వేతనాలు పెంపు

ఏపీలో దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు కనీస వేతనాలను పెంచుతున్నట్లు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు

Advertisement
Update:2024-11-05 20:18 IST

దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కనీస వేతనాలను పెంచుతున్నట్లు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. అర్చకులకు రూ.15వేల కనీస జీతం ఇవ్వాలని సీఎం చంద్రబాబు సూచించినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో 3,203 మంది అర్చకులకు లబ్ధిచేకూరనుందని మంత్రి అన్నారు.

దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై రూ.10కోట్ల మేర అదనపు భారం పడనుందని చెప్పారు. కొంత మొత్తం సీజీఎఫ్‌ నిధుల నుంచి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వేద పండితులు, వేద విద్యార్థులకు నిరుద్యోగ భృతి ద్వారా లబ్ధి కలుగుతుందని ఆనం వెల్లడించారు. దేవదాయ శాఖ 1987 (సెక్షన్-30)లోని 70వ సెక్షన్‌‌ను అనుసరించి అర్చకులకు చెల్లించే కనీస వేతనాన్ని దేవదాయ శాఖ భరించనుంది. 

Tags:    
Advertisement

Similar News