కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన AICC

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలకు ఫోన్లు చేసి బీజేపీ అభ్యర్థిగా ఉన్న తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి ఓటేయాలని కోరినట్టు ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో దీనిపై వివరణ ఇవ్వాలంటూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

Advertisement
Update:2022-10-23 17:36 IST

కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీ లో చేరడం, మునుగోడు నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తుండడంతో వెంకటరెడ్డి తన స్వంత పార్టీకి కాకుండా సోదరుడికోసం ప్రచారం చేస్తున్నాడనే ఆరోపణలున్నాయి.

మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలకు ఫోన్లు చేసి ఈ సారి కాంగ్రెస్ కు కాకుండా తన సోదరుడికి ఓటు వేయాలని కోరుతున్నాడు వెంకట రెడ్డి. ఆ ఆడియో లీక్ అవడంతో ఆయన పట్ల కాంగ్రెస్ లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈనేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్రంగా స్పందించింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి AICC షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ క్రమశిక్షణ నియమావళిని ఉల్లంఘించారని నోటీసుల్లో పేర్కొంది. దీనిపై 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

Tags:    
Advertisement

Similar News