బ్యాంక్ నుంచి బంగారం మాయం
పోలీసులకు ఫిర్యాదు చేసిన మేనేజర్
Advertisement
బ్యాంకులో భద్రంగా ఉండాల్సిన బంగారాన్ని ఎవరో కొట్టేశారు. 50 తులాలకు పైగా బంగారం బ్యాంకు నుంచి మాయమైంది. దీంతో ఆందోళనకు గురైన బ్యాంకు మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లో ఉన్న 50.74 తులాల బంగారం కనిపించకుండా పోయింది. బ్యాంకులో అత్యంత భద్రత మధ్య ఉండే బంగారం ఎలా మాయమైందనే విషయం ఆడిట్ సందర్భంగా బయట పడింది. ఆ బంగారం విలువ రూ.29.20 లక్షలుగా ఉంటుందని బ్యాంకు అధికారులు తెలిపారు. దీంతో బ్యాంకు మేనేజర్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు బంగారం మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Advertisement