అంబర్‌పేట ఫ్లైఓవర్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం
భారీగా ఎగసిపడుతున్న మంటలు, దట్టంగా అలుముకున్న పొగ;
Advertisement
నగరంలోని అంబర్‌పేట ఫ్లైఓవర్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఫ్లైఓవర్ నిర్మాణ సామాను ఉంచిన ప్రదేశంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీగా ఎగసిపడుతున్న మంటలతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో అలుముకున్నది. దీంతో ఆ మార్గంలో వెళ్తున్న వాహనదారులు, స్థానికులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న సిబ్బంది.. మంటలను అదుపుచేయడానికి ప్రయత్నిస్తున్నారు.
Advertisement