హత్య చేసి మృతదేహాన్ని సూట్‌కేస్‌లో కుక్కి..
సాంప్లా బస్టాండ్ వద్ద సూట్‌కేసులో యువతి మృతదేహం;
హర్యానాలోని రోహ్‌తక్‌లో యువతిని దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని సూట్‌కేస్‌లో కుక్కి రోడ్డుపై పడవేసిన ఘటన కలకలం రేపింది. సాంప్లా బస్టాండ్ వద్ద సూట్‌కేసు అనుమానాస్పదంగా కనబడటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరకున్న పోలీసులు సూట్‌కేసు తెరిచి చూడగా.. యువతి మృతదేహం కనిపించింది. మృతురాలినికతురా గ్రామానికి చెందిన హిమానీ నర్వాల్ గా గుర్తించారు. ఆమె కాంగ్రెస్ కార్యకర్త అని తెలిసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను పట్టుకోవడానికి నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కాగా భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి ఆమె నడిచిన ఫోటోలు వైరల్‌గా మారాయి. అటు హర్యానాలో శాంతిభద్రతలు పతనమయ్యాయని బీజేపీ ప్రభత్వంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. నిందితులను వీలైనంత త్వరగా అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.