గాయని కల్పన ఆరోగ్య పరిస్థితిపై హెల్త్‌బులెటిన్
ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నదన్న డాకర్లు;
గాయని కల్పనకు కూకట్‌పల్లిలోని హోలిస్టిక్ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతున్నది. ఆమె ఆరోగ్య పరిస్థితిపై బుధవారం ఉదయం డాకర్లు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. 'గాయని కల్పన నిద్ర మాత్రలు మింగారు. ఆమె ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నాం. కల్పనకు ఇన్‌ఫెక్షన్ ఉండటం వల్ల ఆక్సిజన్ అందిస్తున్నాం. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నది' అని డాకర్లు తెలిపారు. కల్పన కోలుకున్నాక ఆమె వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేయనున్నారు.
హైదరాబాద్ కేపీహెచ్‌బీలోని విల్లాలో ఉంటున్న కల్పన మంగళవారం సాయంత్రం చెన్నైలో ఉన్న భర్తకు ఫోన్ చేసి అపస్మారక స్థితిలోకి వెళ్తున్నట్లు చెప్పారు. ఆయన వెంటనే కాలనీ సంఘం ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. వారు పోలీసులకు చెప్పారు. వారు వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడగా అప్పటికే కల్పన అపస్మారక స్థితిలో ఉన్నారు. వెంటనే సమీప హోలిస్టిక్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికి పరిస్థితి విషమంగా ఉండటంతో క్రిటికల్ కేర్ యూనిట్‌లో వెంటిలేటర్ ఉంచి చికిత్స అందిస్తున్నారు.