ఐఐటీ బాబా అరెస్టు

డ్రగ్స్‌ తీసుకుంటున్నాడని అదుపులోకి తీసుకున్న పోలీసులు;

Advertisement
Update:2025-03-03 17:33 IST

మహాకుంభమేళాతో దేశం దృష్టిని ఆకర్శించిన ఐఐటీ బాబా అలిమాస్‌ అభయ్‌ సింగ్‌ ను రాజస్థాన్‌ లోని షిప్రా పాత్‌ పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. ఐఐటీ బాబా గంజాయి, డ్రగ్స్‌ తీసుకుంటున్నాడని కేసులు నమోదు చేశారు. ఐఐటీ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన అభయ్‌ సింగ్‌ మహాకుంభమేళాకు ముందు సడెన్‌ గా బాబా అవతారం ఎత్తాడు. కుంభమేళాలో తన ఆధ్యాత్మిక ప్రవచానాలు, భవిష్యత్‌ కు సంబంధించిన విషయాలను చెప్తూ సోషల్‌ మీడియా స్టార్‌ అయ్యాడు. ఈక్రమంలోనే చాంపియన్స్‌ ట్రోఫీలో పాకిస్థాన్‌ తో జరిగే లీగ్‌ మ్యాచ్‌లో ఇండియా ఓడిపోతుందని జోష్యం చెప్పి క్రికెట్‌ అభిమానులకు టార్గెట్‌ అయ్యాడు. ఈక్రమంలోనే గత వారం నోయిడాలో అభయ్‌ సింగ్‌ పై కొందరు వ్యక్తులు దాడి చేశారు. ఐఐటీ బాబా ఒక టీవీ చానెల్‌ చర్చలో పాల్గొంటున్న సమయంలోనే చానెల్‌లోకి ప్రవేశించిన కొందరు ముసుగు ధరించిన వ్యక్తులు ఆయనపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన జరిగిన వారం రోజుల్లోనే బాబాను పోలీసులు డ్రగ్స్‌ కేసులో అరెస్టు చేశారు.

Tags:    
Advertisement

Similar News