అమెరికాలో కాల్పులు.. తెలుగు విద్యార్థి దుర్మరణం

అమెరికాలో కాల్పులు కలకలం సృష్టించాయి.;

Advertisement
Update:2025-03-05 16:20 IST

ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన తెలుగు విద్యార్ధిన దుండగుడి కాల్పుల్లో బలయ్యాడు. రంగారెడ్డి జిల్లా కేశంపేట గ్రామానికి చెందిన గంప ప్రవీణ్ యూఎస్‌లో ఎంఎస్ చదువుతున్నాడు. మిల్వాకీ కౌంటీ విస్కాన్సిన్‌ రాష్ట్రం మిల్వాకీ నగరంలో అతని ఇంటికి సమీపంలో బీచ్‌లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ప్రవీణ్ మరణించాడు. దీంతో అతడి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. మృతిపై సమాచారం అందుకున్న అతని కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.   

Tags:    
Advertisement

Similar News