రాయదుర్గం పీఎస్ పరిధిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన;
Advertisement
హైదరాబాద్ రాయదుర్గం పరిధిలో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆరు నెలల కిందటే సతీశ్‌ను దేవిక వివాహం చేసుకున్నది. గోవాలో వీరి వివాహం జరిగింది. వీరు హైదరాబాద్‌లోని ఖాజాగూడలోని ప్రశాంతిహిల్స్‌లో నివాసం ఉంటున్నారు. ఇరువురు ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి దేవిక ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. గమనించిన భర్త పోలీసులకు, కుటుంబసభ్యులకు సమాచారం అందించాడు. వరకట్న వేధింపులే తమ కుమార్తె ఆత్మహత్యకు కారణమని దేవిక తల్లి రామలక్ష్మి పోలీసులక ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement