ఫైళ్ల పరిశీలనలో వేగం పెంచాలి

సమస్యలు పరిష్కరించినప్పుడే మంచి ఫలితాలు వస్తాయన్న సీఎం చంద్రబాబు

Advertisement
Update:2025-02-11 11:52 IST

సమర్థ నాయకత్వం ఉంటేనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమౌతుందని సీఎం చంద్రబాబు అన్నారు. మంత్రులు, కార్యదర్శులతో జరిగిన సమావేశంలో సీఎం మాట్లాటారు. సంపద సృష్టించాలి.. పేదలకు పంచాలి. ఆరు నెలల కాలంలో 12.94 శాతం వృద్ధి రేటు నమోదైంది. గత ఐదేళ్ల విధ్వంసం కారణంగా చాలా వెనుకబడిపోయాం. నెమ్మదిగా ఒక్కో సమస్యను అధిగమిస్తూ ముందుకెళ్తున్నాం. ఫైళ్ల పరిశీలనలో వేగం పెంచాలి. వచ్చిన సమస్యలపై వెంటనే నిర్ణయం తీసుకోవాలి. సమస్యలు పరిష్కరించినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని చంద్రబాబు అన్నారు. 

ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడల్లా ఏదో ఒక సవాల్‌ ఉంటుంది. ఒకటి రెండు కాదు.. ఇన్ని సవాళ్లను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి. ఏడు శ్వేతపత్రాలు విడుదల చేశామన్నారు. నిర్వీర్యమైన వ్యవస్థలను గాడిలో పెట్టడానికే ప్రజలు అధికారం ఇచ్చారు. పాలనా వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేశాం. స్వర్ణాంధ్ర-2047 ద్వారా లక్ష్యాలను నిర్దేశించుకున్నామన్నారు. 15 శాతం వృద్ధి రేటుతో మన ఆర్థిక వ్యవస్థ సుస్థిరం కావాలని, అప్పులూ తీర్చాల్సిన అవసరం ఉన్నదని సీఎం అన్నారు. 

Tags:    
Advertisement

Similar News