సంక్షేమ పథకాలు వేరు. రాజకీయ సంబంధాలు వేరు

సంక్షేమ కార్యక్రమాల అమలులో వివక్ష ఉండదన్న ఏపీ చంద్రబాబు;

Advertisement
Update:2025-03-14 14:27 IST

నామినేటెడ్‌ పదవుల భర్తీకి కసరత్తు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. టీటీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. సరైన వ్యక్తులను సరైన పదవుల్లో నియమిస్తాం. రాష్ట్రవ్యాప్తంగా 21 ప్రధాన ఆలయాలకు ఛైర్మన్ల నియామకం చేపడుతాం. నామినేటెడ్‌ పదవుల కోసం 60 వేల దరఖాస్తులు వచ్చాయి. వాటిని నిశితంగా పరిశీలిస్తున్నాం. మొదటిసారే పదవులు రాలేదని అనుకోవద్దు. రెండేళ్ల పదవీ కాలం ముగిశాక మిగిలిన వారికి అవకాశాలు కల్పిస్తాం. ఇప్పటికే పదవులు తీసుకున్న వారి ప్రతిభను పర్యవేక్షిస్తున్నాం. ప్రతిపక్షంలో ఉన్నట్లు ఇప్పుడూ హుందాగా వ్యవహరించాలి అన్నారు.టీడీపీ నాయకులు ఏ స్థాయిలోనూ వైసీపీ నేతలతో సంబంధాలు పెట్టుకోకూడదు. నేను ఇలా చెబితే.. వైసీపీకి ఓటు వేసిన వారికి పథకాలు ఇవ్వొద్దన్నట్లు ప్రచారం చేస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో వివక్ష ఉండదు. పార్టీలకు అతీతంగా పథకాలు అందజేస్తున్నాం. సంక్షేమ పథకాలు వేరు. రాజకీయ సంబంధాలు వేరు అని చంద్రబాబు తెలిపారు. 

Tags:    
Advertisement

Similar News