పుల్లారావు వడ్డీతో సహా రిటర్న్ ఇస్తా..విడుదల రజిని మాస్ వార్నింగ్
వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎవ్వరినీ వదలిపెట్టమని మాజీ మంత్రి విడుదల రజిని హెచ్చరించింది.
వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎవ్వరినీ వదలిపెట్టమని మాజీ మంత్రి విడుదల రజిని మాస్ వార్నింగ్ ఇచ్చింది. టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుకు వడ్డీతో సహా చెల్లిస్తామని రజిని హెచ్చరించింది. నా 7 ఏళ్ల రాజకీయం ముందు నీ 25 ఏళ్ల రాజకీయం తల దించుకుందని..నాపైనా, మా పార్టీ కార్యకర్తలపైన అక్రమ కేసులు పెట్టి అణిచివేయాలని చూస్తే అంతకు రెట్టింపు బలంతో ఎదుర్కొంటామన్నారు. నీకు మరో నాలుగేళ్లు సమయం ఉందని..అధికారంతో అందిన కాడికి దోచుకుని కూడబెట్టుకుని రిటైరైపోదామనుకుంటున్నారని..కాని నేను 30 నుంచి 40 సంవత్సరాలు రాజకీయం ఇక్కడే చేస్తానని.. మీరు ఎక్కడ ఉన్న, ఏ ఊరిలోదాక్కున్న మీమ్మల్ని వదిలిపెట్టబోనని లాక్కొస్తామని..వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు.
పుల్లారావును చూసుకుని గ్రామాల్లో క్షేత్రస్థాయిలో వైసీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని..అటువంటి వారిని ఎవరిని వదిలిపెట్టేది లేదని అందరి సంగతి తెలుస్తామన్నారు. అధికారులంటే తనకు గౌరవం ఉందని..కొందరు అధికారులు అత్యుత్సాహంతో వ్యవహరిస్తున్నారని..అటువంటి అధికారులను భవిష్యత్తులో వదిలేది లేదన్నారు. విడుదల రజినిపై తాజాగా ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు నమోదైంది. ఆమెకు పీఏలుగా పనిచేసిన ఎన్.జయ ఫణీంద్ర, రామకృష్ణ, అప్పటి చిలకలూరిపేట అర్బన్ సీఐ వి.సూర్యనారాయణపై కూడా కేసు నమోదైంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన తెలుగు దేశంపార్టీ దళిత నాయకుడు పిల్లి కోటి 2019లో పార్టీ సోషల్ మీడియా ఇన్‌చార్జి హోదాలో సోషల్‌మీడియాలో అప్పటి మంత్రి రజినికి చట్ట వ్యతిరేక వ్యవహారాలకు సంబంధించి పోస్టులు పెట్టారు. అందుకు కోటిని ఐదు రోజులు పాటు చిలకలూరిపేట అర్బన్ పోలీస్ స్టేషన్‌లో చిత్రహింసలకు గురి చేశారు. నాటి ఘటనపై పోలీసులకు ఆయన తాజాగా ఫిర్యాదు చేయగా..దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు