చంద్రబాబు హెల్త్ అప్ డేట్.. జైలు సూపరింటెండెంట్ ఏం చెప్పారంటే..?

రాష్ట్రం మొత్తం పర్యటనలు చేస్తున్నప్పుడు హుషారుగా కనపడిన చంద్రబాబు, వయసు తనకు ఓ నెంబర్ మాత్రమేనంటూ హడావిడి చేసే చంద్రబాబు.. జైలులో నీడపట్టున ఉంటే అనారోగ్యానికి ఎందుకు గురవుతారని ప్రశ్నిస్తున్నాయి వైసీపీ శ్రేణులు.;

Advertisement
Update:2023-10-11 08:50 IST

రాజమండ్రి జైలులో మంగళవారం చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్ తర్వాత ఎల్లో మీడియాలో అలజడి మొదలైంది. ఆయన డీహైడ్రేషన్ కు గురయ్యారని, ఆరోగ్యం బాగోలేదని, రచ్చ చేసింది. చంద్రబాబు అనారోగ్యంతో ఉన్నారంటూ హడావిడి చేయడంతో ఇటు టీడీపీ శ్రేణులు కూడా ఆందోళనకు గురయ్యాయి.

అసలేం జరిగిందంటే..?

భువనేశ్వరి, బ్రాహ్మణి, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ నిన్న జైలులో చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. బయటకొచ్చిన తర్వాత పయ్యావుల మాత్రమే మీడియాతో మాట్లాడారు. కృష్ణా జలాలకోసం పోరాటం ఉధృతం చేయాలంటూ చంద్రబాబు తమకు సూచించినట్టు తెలిపారాయన. సాయంత్రం 4 గంటలకు ములాఖత్ జరిగితే.. రాత్రి 9 గంటల తర్వాత ఎల్లో మీడియాలో చంద్రబాబు ఆరోగ్యంపై వార్తలొచ్చాయి. ఆయన డీహైడ్రేషన్ తో బాధపడుతున్నట్టుగా కుటుంబ సభ్యులకు తెలిపారని కథనాలు బయటొకచ్చాయి. జైలులోని వైద్య అధికారులకు కూడా చంద్రబాబు ఆ విషయాన్ని తెలియజేసినట్టు చెప్పారు. ఎండల వల్ల ఉక్కపోతతో చంద్రబాబు డీహైడ్రేషన్ కి గురయ్యారనేది ఆ కథనాల సారాంశం.

జైలు అధికారుల వివరణ..

చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉందని వివరణ ఇచ్చారు జైలు సూపరింటెండెంట్ రాహుల్. చంద్రబాబుకు రోజుకు మూడుసార్లు వైద్య పరీక్షలు చేస్తున్నామని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పారు.

సింపతీ డ్రామా..

చంద్రబాబు ఆరోగ్యం బాగోలేదంటూ ఎల్లోమీడియాలో జరుగుతున్న రాద్ధాంతం అంతా సింపతీ డ్రామా అని కొట్టిపారేస్తున్నారు వైసీపీ నేతలు. కోర్టుల్లో బెయిలు రాకపోవడంతో ఇలా సింపతీకోసం ప్రయత్నాలు మొదలు పెట్టారని సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. రాష్ట్రం మొత్తం పర్యటనలు చేస్తున్నప్పుడు కూడా హుషారుగా కనపడిన చంద్రబాబు, వయసు తనకు ఓ నెంబర్ మాత్రమేనంటూ హడావిడి చేసే చంద్రబాబు.. జైలులో నీడపట్టున ఉంటే అనారోగ్యానికి ఎందుకు గురవుతారని ప్రశ్నిస్తున్నారు. 

Tags:    
Advertisement

Similar News