అమరావతి నిర్మాణానికి రూ. 31,600 కోట్లు

ఖర్చు పెట్టే నిధులన్నీ కేంద్ర ప్రభుత్వం సహా వివిధ బ్యాంకుల నుంచి రుణంగా తీసుకుంటున్నట్లు మంత్రి నారాయణ వెల్లడి;

Advertisement
Update:2025-03-19 18:49 IST

రాజధాని అమరావతి నిర్మాణం కోసం రూ. 31,600 కోట్లు వెచ్చిస్తున్నట్లు మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ఖర్చు పెట్టే నిధులన్నీ కేంద్ర ప్రభుత్వం సహా వివిధ బ్యాంకుల నుంచి రుణంగా తీసుకుంటున్నట్లు తెలిపారు. రాజధాని నిర్మాణానికి ప్రపంచబ్యాంకు, ఏషియన్‌ బ్యాంకు కలిపి రూ. 15 వేల కోట్లు ఇస్తున్నాయని, హడ్కో నుంచి రూ. 15 వేల కోట్లు ఇస్తున్నాయని, జర్మన్‌కు చెందిన బ్యాంకు కేఎఫ్‌ డబ్ల్యూ ద్వారా రూ. 5 వేల కోట్ల రుణం తీసుకుంటున్నట్లు తెలిపారు. అమరావతికి రైల్వే ట్రాక్‌ను కేంద్ర ప్రభుత్వమే నిర్మాణం చేస్తుందని, ట్రాక్ ఏర్పాటుకు భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సి ఉంటుందని తెలిపారు. అమరావతి సెల్ఫ్‌ అసిస్టెంట్‌ ప్రాజెక్టుగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ప్రజలు చెల్లించిన పన్నుల్లో పైసా కూడా అమరావతికి ఖర్చు చేయవద్దని సీఎం ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. బడ్జెట్‌లో అమరావతి నిర్మాణానికి రూ. 6 వేల కోట్లు కేటాయించారని విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించగా.. కేంద్రం, బ్యాంకుల నుంచి నిధులు రాగానే తిరిగి రాష్ట్ర బడ్జెట్‌కు ఖర్చు పెట్టిన నిధులు జమ చేస్తామని మంత్రి తెలిపారు.

Tags:    
Advertisement

Similar News