చంద్రబాబుకి బిగ్ మండే.. అన్ని కోర్టుల్లో ఈరోజే కీలక తీర్పులు

మొత్తంగా 3 కోర్టులు, 6 తీర్పులు. ఇదీ ఈరోజు జరిగే వ్యవహారం. ఇప్పటి వరకూ విచారణలు పూర్తి చేసి తీర్పుల్ని రిజర్వ్ చేసిన కోర్టులు.. ఈరోజు కచ్చితంగా వాటిని వెలువరించే అవకాశముంది.

Advertisement
Update:2023-10-09 07:08 IST

సుప్రీంకోర్టులో నేడు క్వాష్ పిటిషన్ విచారణ..

హైకోర్డులో అంగళ్లు కేసు బెయిల్ పిటిషన్ పై విచారణ

హైకోర్టులోనే ఫైబర్ నెట్ కేసు పిటిషన్ లోనూ విచారణ

ఇన్నర్ రింగ్ రోడ్ కేసు బెయిల్ వ్యవహారం కూడా తేలేది నేడే

ఏసీబీ కోర్టులో చంద్రబాబు కస్టడీపై తీర్పు కోసం వెయిటింగ్

ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై కూడా నేడే తీర్పు

మొత్తంగా 3 కోర్టులు, 6 తీర్పులు. ఇదీ ఈరోజు జరిగే వ్యవహారం. అరెస్ట్ తర్వాత ఏ ఒక్కరోజు కూడా చంద్రబాబుకి కలసి రాలేదు. ఈ సోమవారం అయినా ఆయనకు అనుకూలంగా తీర్పులొస్తాయో లేదో చూడాలి. ఇప్పటి వరకూ విచారణలు పూర్తి చేసి తీర్పుల్ని రిజర్వ్ చేసిన కోర్టులు.. ఈరోజు కచ్చితంగా వాటిని వెలువరించే అవకాశముంది. అంటే ఈరోజు అటో ఇటో తేలిపోతుంది. మిగతా కేసుల సంగతి ఎలా ఉన్నా.. ఏసీబీ కోర్టు బెయిల్ పిటిషన్ కొట్టేసి, రిమాండ్ కి అంగీకరిస్తే మాత్రం అది చంద్రబాబుకి పెద్ద ఎదురుదెబ్బేనని చెప్పాలి.

స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ స్కామ్‌ కేసులో చంద్రబాబు అరెస్టై నెలరోజులు దాటిపోయింది. ఇన్నిరోజులపాటు ఆయన జైలులో ఉంటారని వైసీపీ నేతలు కూడా ఊహించలేదు. తొలిరోజే బెయిల్ పై వచ్చేస్తారని అనుకున్నా అది సాధ్యం కాలేదు. మరోవైపు క్వాష్ పిటిషన్ కూడా అంచెలంచలుగా అన్ని కోర్టులూ దాటుకుని సుప్రీంకోర్టుకి చేరుకుంది. ఇటు ఏసీబీ కోర్టు.. బెయిల్ పిటిషన్ ని వాయిదా వేస్తూ, రిమాండ్ మాత్రం రెండుసార్లు కొనసాగించింది. ఇది చంద్రబాబుకి పెద్ద షాకే. అటు ఫైబర్ నెట్ కేసు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, అంగళ్లు దాడుల కేసులు కూడా చంద్రబాబుని వెంటాడుతున్నాయి. ఈ దశలో మొత్తం వ్యవహారం అంతా కోర్టుల్లోనే అన్నట్టుగా మారిపోయింది. నారా లోకేష్ కూడా ఢిల్లీలోనే మకాం వేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈరోజు వెలువడాల్సిన కీలక తీర్పుల కోసం చంద్రబాబు కుటుంబ సభ్యులే కాదు, టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

Tags:    
Advertisement

Similar News