సెల్ ఫోన్ దొంగతనాలపై ఏపీ పోలీసుల ఫోకస్..

గతంలో పర్సు దొంగతనం జరిగిందని పోలీస్ స్టేషన్లకు వచ్చి కంప్లయింట్ చేసేవారి సంఖ్య ఎక్కువగా ఉండేది, ఆ తర్వాత మెడలో చైన్లు కొట్టేశారనే ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. ఇటీవల స్మార్ట్ ఫోన్ల దొంగలు బాగా ఎక్కువయ్యారు. దేశవ్యాప్తంగా ఈ సమస్య ఉన్నా కూడా పోలీసులు వీటిపై పెద్దగా దృష్టిపెట్టలేకపోతున్నారు. రోజుకి పదుల సంఖ్యలో ఇలాంటి ఫిర్యాదులు అందుతూనే ఉంటాయి. చాలా చోట్ల కేసు రిజిస్టర్ చేసుకోకుండానే ఫిర్యాదు తీసుకుని పంపించేసే సందర్భాలున్నాయి. సెల్ ఫోన్ దొంగతనాలపై ఫోకస్ పెడితే […]

Advertisement
Update:2021-11-26 04:37 IST

గతంలో పర్సు దొంగతనం జరిగిందని పోలీస్ స్టేషన్లకు వచ్చి కంప్లయింట్ చేసేవారి సంఖ్య ఎక్కువగా ఉండేది, ఆ తర్వాత మెడలో చైన్లు కొట్టేశారనే ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. ఇటీవల స్మార్ట్ ఫోన్ల దొంగలు బాగా ఎక్కువయ్యారు. దేశవ్యాప్తంగా ఈ సమస్య ఉన్నా కూడా పోలీసులు వీటిపై పెద్దగా దృష్టిపెట్టలేకపోతున్నారు. రోజుకి పదుల సంఖ్యలో ఇలాంటి ఫిర్యాదులు అందుతూనే ఉంటాయి. చాలా చోట్ల కేసు రిజిస్టర్ చేసుకోకుండానే ఫిర్యాదు తీసుకుని పంపించేసే సందర్భాలున్నాయి. సెల్ ఫోన్ దొంగతనాలపై ఫోకస్ పెడితే రోజువారీ లా అండ్ ఆర్డర్ సమస్యలపై దృష్టిపెట్టలేమన్నది పోలీసుల వాదన. అయితే ఇప్పుడు ప్రకాశం జిల్లా పోలీసులు కేవలం సెల్ ఫోన్ చోరీల కేసుల్ని పరిష్కరించేందుకు ఓ నూతన విధానం తెరపైకి తెచ్చారు.

ఇప్పటికే దొంగతనాల కేసుల్లో ఫోన్ కాల్స్ ట్రేసింగ్ అనేది పోలీసులకు బాగా ఉపయోగపడుతోంది. అదే సమయంలో సెల్ ఫోన్ల చోరీ విషయంలో కూడా ఈ కాల్ ట్రేసింగ్ ని ఉపయోగించుకోవాలనుకుంటున్నారు పోలీసులు. ప్రకాశం జిల్లా పోలీసులు దీనికి సంబంధించిన ఓ ప్రొఫార్మా రెడీ చేశారు. సెల్ ఫోన్ చోరీ గురించి ప్రత్యేకంగా ఫిర్యాదు చేసేలా ఏర్పాటు చేశారు. ఫోన్ నెంబర్, ఐఎంఈఐ నెంబర్ తో పాటు, ఆ ఫోన్ తనదేనని స్వీయ ధృవీకరణ చేస్తూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఫోన్ ఎక్కడ పోయినా, పోయినట్టు గుర్తించిన వెంటనే దగ్గర్లోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించి రిసెప్షన్ రిసిప్ట్ కూడా వెంటనే ఇస్తామని, ఎప్పటికప్పుడు దానికి సంబంధించిన సమాచారం కూడా చెబుతామంటున్నారు. నేరుగా పోలీస్ స్టేషన్ కి రాలేని వారు, 9121102266 అనే నెంబర్ కు తమ ఫోన్ పోయిందంటూ వాట్సప్ లో ఫిర్యాదు చేసినా సరిపోతుందని చెబుతున్నారు ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లిక గార్గ్.

ప్రజలకు మరింతగా సేవలందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఆమె వివరించారు. ఈ నెంబర్ కు సమాచారం అందిన వెంటనే పోగొట్టుకున్న ఫోన్ ను ట్రేస్ చేస్తామని అంటున్నారు. బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇస్తున్నారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలో దీన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి తేవాలనుకుంటున్నారు ఉన్నతాధికారులు.

Tags:    
Advertisement

Similar News