పరాగ్వే జైలులో బ్రెజిల్ సాకర్ స్టార్
కటకటాలు లెక్కిస్తున్న రొనాల్డినో బ్రెజీలియన్ సాకర్ మాజీ స్టార్ రొనాల్డినో పరిస్థితి ఇంత బతుకూ బతికి అన్నట్లుగా తయారయింది. దర్జాగా ఫుట్ బాల్ గ్రౌండ్లో మ్యాచ్ లు ఆడకుండా మరో ఇద్దరితో కలసి పొరుగుదేశం పరాగ్వే జైలులో కటకటాలు లెక్కిస్తున్నాడు. నకిలీ పాస్ పోర్టుతో పరాగ్వేలోకి అడుగుపెట్టిన కారణంగా రొనాల్డినోతో పాటు అతని సోదరుడు, మేనేజర్ లను పరాగ్వే పోలీసులు అదుపులోకి తీసుకొని జైలులో ఉంచారు. పరాగ్వే నిబంధనల ప్రకారం బ్రెజిల్ పౌరులకు వీసా, పాస్ పోర్టులు లేకుండా […]
- కటకటాలు లెక్కిస్తున్న రొనాల్డినో
బ్రెజీలియన్ సాకర్ మాజీ స్టార్ రొనాల్డినో పరిస్థితి ఇంత బతుకూ బతికి అన్నట్లుగా తయారయింది. దర్జాగా ఫుట్ బాల్ గ్రౌండ్లో మ్యాచ్ లు ఆడకుండా మరో ఇద్దరితో కలసి పొరుగుదేశం పరాగ్వే జైలులో కటకటాలు లెక్కిస్తున్నాడు.
నకిలీ పాస్ పోర్టుతో పరాగ్వేలోకి అడుగుపెట్టిన కారణంగా రొనాల్డినోతో పాటు అతని సోదరుడు, మేనేజర్ లను పరాగ్వే పోలీసులు అదుపులోకి తీసుకొని జైలులో ఉంచారు.
పరాగ్వే నిబంధనల ప్రకారం బ్రెజిల్ పౌరులకు వీసా, పాస్ పోర్టులు లేకుండా అడుగుపెట్టే సదుపాయం ఉంది. అయినా రొనాల్డినో ఎందుకు నకిలీ పాస్ పోర్టు తీసుకోవాల్సి వచ్చిందని పరాగ్వే పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
పరాగ్వే రాజధాని అషన్ సియాన్ శివారులో కట్టుదిట్టమైన భద్రత కలిగిన జైలులో…విచారణ పూర్తయ్యే వరకూ లేదా… ఆరు మాసాలపాటు ఉంచాలని న్యాయమూర్తి ఆదేశించారు.
రొనాల్డినో సోదరులు బెయిల్ కోసం 7 లక్షల 70 వేల డాలర్ల ఆస్తులను హామీగా ఉంచడానికి సిద్ధపడినా న్యాయమూర్తి నిరాకరించారు.
రొనాల్డినోను విడిచిపెడితే.. విచారణ కోసం తిరిగి పెరాగ్వే వచ్చే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. 2015లో చివరిసారిగా బ్రెజిల్ జాతీయజట్టు తరపున ఆడిన రొనాల్డినోకు ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు.