డీఎస్పీపై రాళ్లు రువ్విన జనసేన కార్యకర్తలు

పశ్చిమగోదావరి జిల్లాలో మరోసారి జనసేన కార్యకర్తలు రెచ్చిపోయారు. ఇటీవల పేకాట ఆడుతున్న వారిని పోలీసులు అరెస్ట్ చేయగా… జనసేన కార్యకర్తలు నేరుగా స్టేషన్‌ మీదే దాడి చేశారు. తాజాగా నరసాపురంలో పవన్‌ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా పోలీసులపై రాళ్లు రువ్వారు. ఏకంగా నరసాపురం డీఎస్పీ కె. నాగేశ్వరరావు వాహనం పైనే దాడి చేశారు. అనుమతులు తీసుకోకుండా నడిరోడ్డుపై భారీ కేక్‌ కట్ చేసేందుకు జనసేన అభిమానులు సిద్ధమయ్యారు. రోడ్డుపై కార్యక్రమం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతారని… […]

Advertisement
Update:2019-09-01 03:12 IST

పశ్చిమగోదావరి జిల్లాలో మరోసారి జనసేన కార్యకర్తలు రెచ్చిపోయారు. ఇటీవల పేకాట ఆడుతున్న వారిని పోలీసులు అరెస్ట్ చేయగా… జనసేన కార్యకర్తలు నేరుగా స్టేషన్‌ మీదే దాడి చేశారు. తాజాగా నరసాపురంలో పవన్‌ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా పోలీసులపై రాళ్లు రువ్వారు.

ఏకంగా నరసాపురం డీఎస్పీ కె. నాగేశ్వరరావు వాహనం పైనే దాడి చేశారు. అనుమతులు తీసుకోకుండా నడిరోడ్డుపై భారీ కేక్‌ కట్ చేసేందుకు జనసేన అభిమానులు సిద్ధమయ్యారు. రోడ్డుపై కార్యక్రమం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతారని… వేరే చోట కార్యక్రమం నిర్వహించుకోవాలని స్థానిక ఎస్‌ఐ సూచించగా ఆయనపై తిరుగబడ్డారు.

అనంతరం పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దాంతో భయానక వాతావరణం ఏర్పడింది. ప్రజలు భయంతో పరుగులు తీశారు. అదే సమయంలో అటుగా వచ్చిన డీఎస్పీ వాహనంపైనా రాళ్లు రువ్వారు. అద్దాలు పగులగొట్టారు. ఈ దాడికి జనసేన స్థానిక నేత బొమ్మిడి నాయకర్ నాయకత్వం వహించారు. డీఎస్పీపై దాడిని తీవ్రంగా తీసుకున్న పోలీసులు ఆందోళనకారులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News