తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై అరెస్టు

తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అరెస్టు అయ్యారు.;

Advertisement
Update:2025-03-06 14:27 IST

తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అరెస్టు అయ్యారు. తమిళనాడులో త్రిభాషా వివాదం తీవ్ర ఉద్రిక్తత కు దారితీసింది. త్రిభాషా విధానానికి మద్దతుగా బీజేపీ సంతకాల సేకరణ చేపట్టింది. ఈ క్రమంలో బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. కోటి మంది సంతకాలు సేకరించి రాష్ట్రపతికి నివేదిస్తామన్నారు నేతలు.ప్రధానంగా త్రిభాషా విధానానికి మద్దతుగా బీజేపీ నేతలు చెన్నై ఎంజీ ఆర్ నగర్ లో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ బీజేపీ నేతలను అడ్డుకున్నారు పోలీసులు. దీంతో తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ నేత తమిళిసైతో సహా ఇతర నేతలను అరెస్ట్ చేశారు పోలిసులు.

Tags:    
Advertisement

Similar News