సుప్రీంకోర్టులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట
ఉదయనిధి స్టాలిన్ కొత్త కేసులు నమోదు చేయొద్దని సుప్రీంకోర్టు సూచించింది.;
Advertisement
తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. సనాతన ధర్మంపై స్టాలిన్ చేసిన వ్యాఖ్యల అంశాన్ని కారణంగా తీసుకొని ఆయనపై కొత్త కేసులు నమోదు చేయొద్దని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్స్ పై ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా బిహార్‌లో ఇదే అంశంపై మరో కేసు నమోదైంది. 2023 సెప్టెంబరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయనిధి మాట్లాడుతూ.. ‘‘సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని ఆయన కామెంట్స్ చేశారు. ఇది సామాజిక న్యాయానికి వ్యతిరేకమన్నారు. హిందూ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
Advertisement