ప్రముఖ గాయనితో ఎంపీ తేజస్వీ సూర్య పెళ్లి
బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య భరతనాట్య కళాకారిణి శివశ్రీ స్కంద ప్రసాద్‌ను వివాహం చేసుకున్నారు;
Advertisement
బెంగళూరు సౌత్ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఓ ఇంటివారయ్యారు. కర్ణాటక గాయని శివశ్రీ స్కంద ప్రసాద్‌ను పెళ్లి చేసుకున్నారు. ఎలాంటి హడావిడి లేకుండా సంప్రదాయ పద్దతిలో వీరిద్దరూ ఒక్కటయ్యారు. వివాహఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. బెంగళూరులో జరిగిన తేజస్వీ సూర్య వివాహానికి కేంద్రమంత్రులు అర్జున్ రామ్ మేఘవాల్, వి. సోమన్న, బీజేపీ నేతలు అన్నామలై, అమిత్ మాలవీయ, బీవై విజయేంద్ర తదితరులు హాజరయ్యారు.
కొత్త జంటను ఆశీర్వదించారు. శివశ్రీ.. మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి భరతనాట్యంలో ఎంఏ, మద్రాస్ సంస్కృత కళాశాలలో సంస్కృతంలో ఎంఏ పూర్తి చేశారు. ‘పొన్నియిన్ సెల్వన్’తో నేపథ్య గాయనిగా గుర్తింపు సాధించారు.
Advertisement