హైకోర్టులో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
తెలంగాణ హైకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది.;
తెలంగాణ హైకోర్టులో కాంగ్రెస్ ప్రభుత్వాన్నికి ఎదురుదెబ్బ తగిలింది. లగచర్ల, హకీంపేట భూసేకరణ నోటిఫికేషన్ రద్దు అయింది. కాగా భూసేకరణను వ్యతిరేకిస్తూ ఇక్కడ ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేయడంపై అభ్యంతరలు చెబుతూ దాఖలైన పిటిషన్లపై పలువురు కొర్టును ఆశ్రయించారు. లగచర్ల, హకీంపేటలో భూసేకరణ సమయంలో ఆందోళనలు జరిగి పలువురిపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే.
భూసేకరణపై స్టే ఇచ్చిన తెలంగాణ హైకోర్టు… లగచర్ల, హకీంపేటలో భూసేకరణ నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. దీంతో… తెలంగాణ రాష్ట్ర సర్కార్‌కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది.లగచర్లలో మొదట ఫార్మా కంపెనీల కోసం భూసేకరణ చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. అల్లుడి కంపెనీ కోసం భూసేకరణ అంటూ ఆరోపణలు, లగచర్ల రైతులు ఎదురు తిరగడంతో వెనక్కి తగ్గింది ప్రభుత్వం. మళ్లీ ఇండస్ట్రియల్ కారిడార్ పేరిట భూసేకరణ మొదలు పెట్టింది ప్రభుత్వం. ఈ తరుణంలోనే… భూసేకరణ ఆపాలని స్టే ఇచ్చింది హై కోర్టు.