శ్రీవారి అన్న ప్రసాదంలో వడలు
శ్రీవారి భక్తులకు వడలు వడ్డింపు కార్యక్రమన్ని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ప్రారంభించారు.;
Advertisement
తిరుమల శ్రీవారి భక్తులకు వడలు వడ్డింపు కార్యక్రమన్ని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ప్రారంభించారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ మాట్లాడుతు ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించాక అన్నప్రసాదం మెనూలో ఒక పదార్థం అదనంగా పెట్టాలనే ఆలోచన కలిగింది.
దాన్నిముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాను. ఆయన అంగీకారంతో నేటి నుంచి అన్నప్రసాదంలో వడలను ప్రవేశపెట్టామన్నారు. నాణ్యమైన దినుసులతో భక్తులు రుచికరమైన అన్నప్రసాదాలను మా అధికారులు వడ్డిస్తున్నారు. రోజూ ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 35వేల వడలను భక్తులకు వడ్డిస్తాం. భవిష్యత్తులో ఈ సంఖ్యను మరింత పెంచి రుచికరమైన భోజనం అందిస్తాం ఆయన తెలిపారు
Advertisement