మంత్రి కొండా సురేఖ పెంపుడు కుక్క‌ మృతి.. క‌న్నీరుమున్నీరైన మంత్రి

పెంపుడు శునకం ఆకస్మిక మరణంతో మంత్రి కొండా సురేఖ‌ కంటతడి పెట్టుకున్నారు.;

Advertisement
Update:2025-03-06 12:35 IST

మంత్రి కొండా సురేఖ పెంపుడు కుక్క‌ ఆకస్మికంగా మృతి చెందడంతో మంత్రి కంటతడి పెట్టుకున్నారు. గుండెపోటుతో చ‌నిపోయిన త‌న పెంపుడు కుక్క హ్యాపీకి‌ అంతిమ సంస్కారాలుమంత్రి కొండా సురేఖ నిర్వహించారు. చుట్టూ ఉన్న మ‌నుషుల‌తోనే కాదు, మూగ జీవాల‌తోనూ భావోద్వేగభ‌రిత సత్సంబంధాలు నెరిపిన మనసున్న నేత మంత్రి సురేఖ‌ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.అల్లారుముద్దుగా పెంచుకున్న హ్యాపీ (పెంపుడు కుక్క‌) చ‌నిపోవడంతో మంత్రి కొండా కుటుంబం దానికి అంతిమ సంస్కారాలు నిర్వహించింది. ‘హ్యాపీ’ హఠాన్మరణంతో సురేఖ కుటుంబీకులు, సిబ్బంది క‌న్నీటి ప‌ర్యంతం అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Tags:    
Advertisement

Similar News