తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్సీలకు ప్రధాని మోదీ అభినందనలు

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికైన ఎమ్మెల్సీలకు ప్రధాని మోదీ ఎక్స్‌’ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు;

Advertisement
Update:2025-03-06 11:46 IST

తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపోందిన ఎమ్మెల్సీలకు ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్టర్ వేదికగా అభినందించారు. నూతనంగా బీజేపీ తరపున ఎమ్మెల్సీలుగా ఎన్నికైన తెలంగాణకు చెందిన మల్క కొమరయ్య, అంజిరెడ్డికి ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారు. ఏపీలో ఎన్డీయే కూటమి విజయంపై హర్హం వ్యక్తం చేశారు.

ప్రధాని మోదీకి ఏపీలోని ఎన్డీయే పక్షాల తరఫున సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. మోదీ నేతృత్వంలో దేశంలో, రాష్ట్రంలో మరిన్ని విజయాలు దక్కుతాయని చెప్పారు. ఎన్డీయే పాలనలో అన్ని వర్గాల ప్రజల సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందని ఆశించారు. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంతో తెలంగాణ బీజేపీ శ్రేణులు ఫుల్ జోష్ లో ఉన్నాయి. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయడంపై కమలం నేతలు దృష్టి సారిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News