బాబుకు జగన్ ఇచ్చే కేబినెట్ పదవి... వీళ్లకేనా?

చంద్రబాబు ఓడిపోయాడు. అసెంబ్లీలో ఇప్పుడు ప్రతిపక్ష పాత్రకే పరిమితమైపోయాడు. ఇప్పుడు ఏ పదవులు అనుభవించడానికి ఉండదు. కానీ అసెంబ్లీలో అధికార పార్టీ ప్రతిపక్షానికి ఒక కీలకమైన పీఏసీ చైర్మన్ పదవిని ఇస్తుంది. ఇది కేబినెట్ ర్యాంక్ పదవి. మంత్రులతో సమానమైన పదవి. మరి జగన్ సర్కారు కూడా ఇప్పుడు చంద్రబాబుకు ఆఫర్ ఇచ్చింది. ఇలాంటి అత్యున్నత పదవితో అధికార పక్షం వైసీపీని కడిగేసి.. వారి బడ్జెట్ సహా పాలనలోని లోపాలను ఎత్తి చూపే సామర్థ్యం ఎవరికుందనే విషయంపై […]

Advertisement
Update:2019-07-22 13:30 IST

చంద్రబాబు ఓడిపోయాడు. అసెంబ్లీలో ఇప్పుడు ప్రతిపక్ష పాత్రకే పరిమితమైపోయాడు. ఇప్పుడు ఏ పదవులు అనుభవించడానికి ఉండదు. కానీ అసెంబ్లీలో అధికార పార్టీ ప్రతిపక్షానికి ఒక కీలకమైన పీఏసీ చైర్మన్ పదవిని ఇస్తుంది. ఇది కేబినెట్ ర్యాంక్ పదవి. మంత్రులతో సమానమైన పదవి.

మరి జగన్ సర్కారు కూడా ఇప్పుడు చంద్రబాబుకు ఆఫర్ ఇచ్చింది. ఇలాంటి అత్యున్నత పదవితో అధికార పక్షం వైసీపీని కడిగేసి.. వారి బడ్జెట్ సహా పాలనలోని లోపాలను ఎత్తి చూపే సామర్థ్యం ఎవరికుందనే విషయంపై ఇప్పుడు చంద్రబాబు ఆరాతీస్తున్నాడు. జగన్ ను ఇరుకున పెట్టే పీఏసీ చైర్మన్ పదవిలో బలమైన నేతను నియమించాలని బాబు యోచిస్తున్నాడట..

గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పీఏసీ చైర్మన్ పదవిని అప్పటి ప్రతిపక్ష నేత జగన్ సబ్జెక్ట్ పై మంచి పట్టున్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఇచ్చారు. ఆయన ప్రభుత్వంలోని లోపాలను ఎత్తిచూపుతూ చంద్రబాబును తీవ్ర ఇరకాటంలో పడేశారు. ఇప్పుడు అలాంటి పదవిలో టీడీపీ అధినేత ఎవరిని నిలబెడుతారన్న ఆసక్తి నెలకొంది..

అయితే చంద్రబాబు మదిలో పీఏసీ చైర్మన్ గా అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరిలు ఉన్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే ఈ పదవి ఇస్తేనే తాను పార్టీలో ఉంటానంటూ మాజీ మంత్రి గంటా చంద్రబాబుకు అల్టీమెటం ఇచ్చినట్లు సమాచారం. ఉత్తరాంధ్రలో బలమైన సామర్థ్యం ఉన్న గంటాకు ఇస్తారా లేదా అన్నది డౌటే.

ఎందుకంటే గంటా అసెంబ్లీలో చంద్రబాబును తిడుతున్నా.. వైసీపీ విరుచుకుపడుతున్నా నోరు మెదపకుండా ఉంటున్నాడు. బాబుకు తోడుగా అచ్చెన్నాయుడు, బుచ్చయ్యలు మాత్రమే ఢీ కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే గంటా బెదిరింపులకు లొంగి బాబు ఇస్తాడా…. లేక అచ్చెన్నాయుడె, బుచ్చయ్య చౌదరి లలో ఎవరో ఒకరికి ఇస్తాడా అన్నది వేచిచూడాలి.

Tags:    
Advertisement

Similar News