మిగిలిన మృతదేహాల జాడ కోసం ప్రయత్నం
ఎస్‌ఎల్‌బీసీ సొరంగం వద్ద 17వ రోజు కొనసాగుతున్న సహాయక చర్యలు;
ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో చిక్కుకున్న మరో ఏడు మంది జాడకోసం రాత్రిపగలు అధికార యంత్రాంగం సహాయక చర్యలు కొనసాగిస్తూనే ఉన్నదని కలెక్టర్, ఎస్పీ తెలిపారు. టీబీఎం పరికరాలు తొలిగించి లోకోపైలట్ ద్వారా బైటికి పంపిస్తున్నారు. అదేవిధంగా ఎప్పటిప్పుడు నీటిని తొలిగిస్తున్నారు. మిగిలిన మృతదేహాలను కనిపెట్టే యంత్రాలు, పుష్ కెమెరాలు, గ్రౌండ్-పెనెట్రేటింగ్ రాడార్ సర్వే చేస్తున్నారు.ఎస్‌ఎల్‌బీసీ సొరంగం వద్ద 17వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రత్యేక జాగిలాలతో గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన చోట శిథిలాలను తొలిగిస్తే మళ్లీ సొరంగం పైకప్పు కూలే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు. నిన్న ఓ మృతదేహాన్ని రెస్క్యూ బృందం వెలికి తీసింది. మిగతా వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని కలెక్టర్, ఎస్పీ తెలిపారు.