తొమ్మిదేళ్ళుగా.... ప్రేమ జంట డ్రగ్స్ దందా....

హైదరాబాద్ లో డ్రగ్స్ విక్రయిస్తున్న ఒక ప్రేమ జంటను పోలీసులు అరెస్ట్ చేసారు. వారి నుంచి తొమ్మిది గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రేమ జంట గత తొమ్మిది సంవత్సరాలుగా ఈ దందాను సాగిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. యువత, ఐటి ఉద్యోగులు, విద్యార్ధులను టార్గెట్ చేసుకుని వీరు డ్రగ్స్ వ్యవహారం నడుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. కొంత మంది నైజీరియన్స్ వీరికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు ఈ ప్రేమ జంట పోలీసులకు చెప్పారు. […]

Advertisement
Update:2019-06-19 02:30 IST

హైదరాబాద్ లో డ్రగ్స్ విక్రయిస్తున్న ఒక ప్రేమ జంటను పోలీసులు అరెస్ట్ చేసారు. వారి నుంచి తొమ్మిది గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రేమ జంట గత తొమ్మిది సంవత్సరాలుగా ఈ దందాను సాగిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

యువత, ఐటి ఉద్యోగులు, విద్యార్ధులను టార్గెట్ చేసుకుని వీరు డ్రగ్స్ వ్యవహారం నడుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. కొంత మంది నైజీరియన్స్ వీరికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు ఈ ప్రేమ జంట పోలీసులకు చెప్పారు. వారి దగ్గర నుంచి కొకైన్, గంజాయితో సహా ఇతర మత్తు పదార్ధాలను తీసుకుని…. వీరు హైదరాబాద్ లో కాలేజీ స్టూడెంట్స్ కు, ఐటి ఉద్యోగులకు అమ్ముతున్నట్లు తెలుస్తోంది.

ముందుగా వీరు కళాశాల వద్ద రెక్కి నిర్వహించి, సిగరెట్లు కాలుస్తున్న యువతను గుర్తించి, వారితో తాము ఐటి ఉద్యోగులుగా పరిచయం చేసుకుని స్నేహం పెంచుకుంటారు. ఆ తర్వాత వారికి డ్రగ్స్ అలవాటు చేస్తారు. ఇలా ఈ దందాను గత తొమ్మిది సంవత్సరాలుగా ఎవరికీ అనుమానం రాకుండా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇలా జంట నగరాలలో డ్రగ్స్ సరఫరాను చాప క్రింద నీరులా విస్తరిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. దీనికి యువత బలి అవుతోందని, దీనికి వెంటనే అడ్డుకట్ట వేయాలని పలువురు బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి.

నగరంలో రోజురోజుకు మత్తు పదార్ధాలు వివిధ మార్గాలలో యువతకు చేరుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల నుంచి వందల కిలోల గంజాయి నగరానికి సరఫరా కావడం పోలీసులను కలవరపెడుతోంది.

ఇప్పటి వరకూ వేలాది కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు… దాన్ని నగరానికి తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. అయినా నగరంలో ఏదో ఒక మూల డ్రగ్స్, గంజాయి సరఫరా కేసులు బయటపడుతూనే ఉండడం ఆందోళన కలిగిస్తోంది.

Tags:    
Advertisement

Similar News