అనిల్‌ ని బదనాం చేస్తున్న టీడీపీ మీడియా

టీడీపీ మీడియా ఇప్పుడు ఎమ్మెల్యే అనిల్‌ను టార్గెట్ చేసింది. మంత్రి నారాయణతో కలిసి వైసీపీ ఎమ్మెల్యేను బదనాం చేసేందుకు వీడియో గేమ్ ఆడి మళ్లీ అడ్డంగా దొరికిపోయింది. ఎన్నికల ప్రచారంలో చంపడమో, చావడమో చేయాలంటూ కార్యకర్తలకు ఎమ్మెల్యే అనిల్ పిలుపునిచ్చారంటూ ఒక వీడియోను నారాయణ బృందం ప్రచారంలోకి తీసుకురాగా… టీడీపీ మీడియా దాన్ని ప్రమోట్‌ చేసే పని తీసుకుంది. అయితే ఈ ప్రసంగం ఎప్పటిది, ఏ సందర్బంలో చేశారన్నది ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవే మీడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చారు. నిజానికి ప్రస్తుతం టీడీపీ ప్రచారం చేస్తున్న […]

Advertisement
Update:2019-04-02 12:43 IST

టీడీపీ మీడియా ఇప్పుడు ఎమ్మెల్యే అనిల్‌ను టార్గెట్ చేసింది. మంత్రి నారాయణతో కలిసి వైసీపీ ఎమ్మెల్యేను బదనాం చేసేందుకు వీడియో గేమ్ ఆడి మళ్లీ అడ్డంగా దొరికిపోయింది.

ఎన్నికల ప్రచారంలో చంపడమో, చావడమో చేయాలంటూ కార్యకర్తలకు ఎమ్మెల్యే అనిల్ పిలుపునిచ్చారంటూ ఒక వీడియోను నారాయణ బృందం ప్రచారంలోకి తీసుకురాగా… టీడీపీ మీడియా దాన్ని ప్రమోట్‌ చేసే పని తీసుకుంది.

అయితే ఈ ప్రసంగం ఎప్పటిది, ఏ సందర్బంలో చేశారన్నది ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవే మీడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చారు. నిజానికి ప్రస్తుతం టీడీపీ ప్రచారం చేస్తున్న అనిల్ ప్రసంగం వీడియో ఇప్పటిది కాదు. 2018 జనవరి 5న జరిగిన వైసీపీ యువజన సదస్సులో చేసిన ప్రసంగం.

ఆ సదస్సులో మాట్లాడిన అనిల్ కుమార్‌ యాదవ్… యుద్ధంలోకి దిగిన తర్వాత సైనికుడి ముందు చంపడమో… చావడమో రెండు దారులుంటాయని వ్యాఖ్యానించారు. ఎన్నికలు కూడా యుద్ధం లాంటివేనని… కాబట్టి విజయమో, వీర స్వర్గమో
అన్నట్టు పోరాటం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఏడాది క్రితం చేసిన ఈ ప్రసంగాన్ని ఇప్పుడు టీడీపీ నేతలు, మీడియా తెరపైకి తెచ్చింది. యుద్ధంలో దిగిన సైనికుడు చంపడమో చావడమో చేయాలని అనిల్ చెబితే… యుద్ధం, సైనికుడు అన్న పదాలను తీసేసి చంపడమో చావడమో ఎన్నికల్లో చేయాలని అనిల్ ఆదేశించారని ప్రచారం మొదలుపెట్టారు

Tags:    
Advertisement

Similar News