పవన్ ను శాశ్వతంగా భూస్థాపితం చేయడానికి చంద్రబాబు ప్రయత్నం
ప్రజాసమస్యల పరిష్కారానికే ప్రతిపక్షహోదా కోరుతున్నామన్న సతీశ్‌కుమార్ రెడ్డి
అసెంబ్లీలో సమర్థవంతమైన చర్చ జరగాలంటే వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీశ్‌కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజాసమస్యల పరిష్కారానికే ప్రతిపక్షహోదా కోరుతున్నామన్నారు. ఏపీ ప్రజలకు మేలు జరగాలంటే వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనన్నారు.పులివెందులలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ ను నమ్మడం వల్లే ప్రజలు వారికి పట్టం కట్టారు చంద్రబాబు అబద్ధాలు నమ్మడం లేదని పవన్ తో పచ్చి అబద్ధాలు మాట్లాడించారని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష హోదా లేదంటున్న పవన్ కల్యాణ్.. ప్రతిపక్ష హోదా ఆయన పోషిస్తాడా? ప్రజల తరఫున పోరాటం చేస్తావా? నిన్ను శాశ్వతంగా భూస్థాపితం చేయడానికి చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. షర్మిల, నువ్వు చంద్రబాబుకు చెంచాగిరి చేస్తున్నారా? నీ వ్యక్తిగత సమస్యలు ఉంటే ఇంట్లో చూసుకోవాలని సూచించారు. పవన్, షర్మిలను ఉపయోగించుకుని చంద్రబాబు గేమ్ ఆడుతున్నారు. సమర్థమైన చర్చలు ప్రతిపక్షం లేకుండా ఎలా జరుగుతాయని సతీశ్‌కుమార్ రెడ్డి ప్రశ్నించారు.