టీడీపీ అభ్యర్థుల ప్రకటన.... లీకులే, అధికారికం కాదు!
ఇదిగో.. ఈ రోజుకు ఐదు సీట్లలో అభ్యర్థులు ఖరారు అయిపోయారు.. మరోరోజుకు మరో పది సీట్లకు బాబు అభ్యర్థులను తేల్చేశారు.. అంటూ బాబు అనుకూల మీడియా ప్రచారం చేస్తూ ఉంది. రాజంపేట లోక్ సభ సీటు పరిధిలో, కడప ఎంపీ సీటు పరిధిలో అభ్యర్థులు ఖరారు అయిపోయారని ప్రచారం చేస్తూ ఉంది బాబు అనుకూల మీడియా. ఇక కర్నూలు జిల్లా విషయంలో కసరత్తు సాగుతూ ఉందని ఆ వర్గాలు ప్రచారం చేస్తూ ఉన్నాయి. అయితే.. ఇన్ని వార్తలను […]
ఇదిగో.. ఈ రోజుకు ఐదు సీట్లలో అభ్యర్థులు ఖరారు అయిపోయారు.. మరోరోజుకు మరో పది సీట్లకు బాబు అభ్యర్థులను తేల్చేశారు.. అంటూ బాబు అనుకూల మీడియా ప్రచారం చేస్తూ ఉంది. రాజంపేట లోక్ సభ సీటు పరిధిలో, కడప ఎంపీ సీటు పరిధిలో అభ్యర్థులు ఖరారు అయిపోయారని ప్రచారం చేస్తూ ఉంది బాబు అనుకూల మీడియా. ఇక కర్నూలు జిల్లా విషయంలో కసరత్తు సాగుతూ ఉందని ఆ వర్గాలు ప్రచారం చేస్తూ ఉన్నాయి.
అయితే.. ఇన్ని వార్తలను వడ్డీస్తూ ఉన్నా.. ఇదంతా మీడియా హడావుడి మాత్రమే అని అంటున్నారు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు లీకు రాజకీయాలను నడపడంలో సిద్ధహస్తుడు. ఏ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు సూటిగా మాట్లాడరు. తన అభిప్రాయాలను మీడియాకు లీకులుగా ఇస్తూ ఉంటారు. ఒకవేళ వాటిపై నెగిటివ్ రియాక్షన్ వస్తే.. దానితో తనకు సంబంధమే లేదన్నట్టుగా, ఒకవేళ దానిపై పాజిటివ్ రియాక్షన్ వస్తే.. తనే ముందే చెప్పా.. అన్నట్టుగా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తూ ఉంటాడు.
అదీ చంద్రబాబు మార్కు రాజకీయం. ఇప్పుడు అభ్యర్థుల ప్రకటన విషయంలో కూడా అదే రాజకీయమే సాగుతోందని సమాచారం.
చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకూ ఈ అంశం చేసింది అంతా ఉత్తుత్తి హడావుడి మాత్రమేనట. నేతలను పిలిపించుకుని మాట్లాడటం.. ఈ సీట్లో పని చేసుకోండి.. అని అనడం. అంతకు మించి వారికి బాబు భరోసాలు ఇవ్వడం లేదు.
అధికారికంగా సదరు నేతలే పార్టీ తరఫున పోటీ చేస్తారని ప్రకటించడం లేదు. ఊరికే పని చేసుకోండి.. అని చెప్పడం. ఈ మాత్రం దానికే తెలుగుదేశం అనుకూల మీడియా చాలా హడావుడి చేసేస్తోంది. అభ్యర్థులు ఖరారు అయిపోయారని అంటోంది. వరస పెట్టి నియోజకవర్గాల పేర్లను.. అక్కడ పోటీ చేసే అభ్యర్థులు అంటూ టీడీపీ అనుకూల మీడియా హడావుడి చేస్తోంది.
ఇదంతా ఒట్టి మీడియా హడావుడి మాత్రమే అని.. చంద్రబాబు నాయుడు ఏ నిమిషంలో అయినా కథను మార్చేయవచ్చు అని.. అభ్యర్థిత్వాల విషయంలో అధికారిక ప్రకటనలు నామినేషన్ల నాటికి కానీ వచ్చే అవకాశలు లేవని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.