ప్రపంచ క్రికెట్ మక్కాకు కొత్తహంగులు
లార్డ్స్ స్టేడియంలో సరికొత్త స్టాండ్ లు 31వేలకు పెరగనున్న సీటింగ్ సామర్థ్యం క్రికెట్ పుట్టినిల్లు, ప్రపంచ క్రికెట్ మక్కా లార్డ్స్ స్టేడియం సరికొత్త హంగులకు సిద్ధమవుతోంది. 2020 నాటికి మూడంతస్తుల సరికొత్త స్టాండ్ తో పాటు…స్టేడియం సీటింగ్ కెపాసిటీని 31వేలకు పెంచేలా ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ మేరకు మెర్లిబోన్ క్రికెట్ క్లబ్ వార్షిక సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. స్టేడియం నర్సరీ ఎండ్ భాగంలో ఈ సరికొత్త స్టాండ్ ను నిర్మించాలని నిర్ణయించారు. మొత్తం 50 మిలియన్ పౌండ్ల […]
- లార్డ్స్ స్టేడియంలో సరికొత్త స్టాండ్ లు
- 31వేలకు పెరగనున్న సీటింగ్ సామర్థ్యం
క్రికెట్ పుట్టినిల్లు, ప్రపంచ క్రికెట్ మక్కా లార్డ్స్ స్టేడియం సరికొత్త హంగులకు సిద్ధమవుతోంది. 2020 నాటికి మూడంతస్తుల సరికొత్త స్టాండ్ తో పాటు…స్టేడియం సీటింగ్ కెపాసిటీని 31వేలకు పెంచేలా ప్రణాళికను సిద్ధం చేశారు.
ఈ మేరకు మెర్లిబోన్ క్రికెట్ క్లబ్ వార్షిక సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. స్టేడియం నర్సరీ ఎండ్ భాగంలో ఈ సరికొత్త స్టాండ్ ను నిర్మించాలని నిర్ణయించారు.
మొత్తం 50 మిలియన్ పౌండ్ల బడ్జెట్ తో నిర్మాణ పనులకు అనుమతి ఇచ్చారు. లార్డ్స్ స్టేడియంలోని కాంప్టన్ , ఎడ్రిచ్ స్టాండ్ ల స్థానంలో మూడంతస్తుల స్టాండ్ ను అత్యాధునిక హంగులతో నిర్మించనున్నారు.
ప్రపంచ క్రికెట్ అత్యంత పురాతన వేదిక లార్డ్స్ స్టేడియం ఎన్నో అరుదైన రికార్డులకు, మ్యాచ్ లకు వేదికగా నిలిచింది.
లార్డ్స్ స్టేడియంలోని గంట నుంచి స్టాండ్ వరకూ…ప్రతి ఒక్క అంశం వెనుక ఎంతో పురాతన చరిత్ర ఉంది.