మాజీ సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అక్షేపనీయం : మేడే రాజీవ్ సాగర్
ఉద్యమ నాయకుడు కేసీఆర్ ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర అక్షేపనీయమని బీఆర్‌నేత మేడే రాజీవ్ సాగర్ అన్నారు;
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఉద్యమ నాయకుడు కేసీఆర్ ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర అక్షేపనీయమని తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై చేసిన స్ట్రేచర్ నుంచి మార్చురీకి వెళుతారన్న అభ్యంతకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అనే విషయం మరిచి చీపు మినిస్టర్ గా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ఒక్క రోజు అసెంబ్లీకి వస్తేనే ప్రస్టేషన్ తెచ్చుకుంటున్న రేవంత్ రెడ్డి కేసీఆర్ అసెంబ్లీ వేదిక ప్రశ్నిస్తే కాంగ్రెస్ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
అసెంబ్లీ వేదిక కాంగ్రెస్ ఇచ్చి మరిచిన హామీలపై కేసీఆర్ నీలదిస్తే రేవంత్ రెడ్డి ఏం చేస్తారని విమర్శించారు. కేసీఆర్ పేరు జపం చేయనిదే రేవంత్ రెడ్డికి పొద్దుగడవడం లేదన్నారు. ప్రభుత్వ వేదికను రేవంత్ రెడ్డి సీఎం అయ్యినప్పటి నుంచి రాజకీయ వేదికగా మార్చారని దుయ్యబట్టారు. ప్రతి ప్రభుత్వ వేదిక పై కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పాల్సిందిపోయి కేసీఆర్ ను బీఆర్ఎస్ పార్టీని నిందించడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. రైతు రుణ మాఫీ, రైతుభరోసా రాక గ్రామ గ్రామాన ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిడుతుంటే తట్టుకోలేక రేవంత్ రెడ్డి ఫ్రస్టేషన్ లో మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారు.