సునీతా విలియమ్స్‌కు మళ్లీ నిరాశే!

సునీతా విలియమ్స్‌, బచ్‌ విల్మోర్‌లను భూమిపైకి తీసుకువచ్చే నాసా మిషన్‌ ప్రయోగం సాంకేతిక లోపంతో వాయిదా;

Advertisement
Update:2025-03-13 10:18 IST

సునీతా విలియమ్స్‌కు మళ్లీ నిరాశే మిగిలింది. నాసా మిషన్‌ వాయిదా పడింది. వ్యోమగాములు సునీతా విలియమ్స్‌, బచ్‌ విల్మోర్‌ 9 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయారు. వారిని భూమిపైకి తీసుకురావడానికి నాసా-స్సేస్‌ఎక్స్‌ క్రూ 10 మిషన్‌ రూపకల్పన చేసింది. ఈ క్రమంలో నలుగురు వ్యోగగాములు ఫాల్కన్‌ 9 రాకెట్‌లో బయలుదేరడానికి సిద్ధంగా కాగా సాంకేతిక లోపంతో ప్రయోగం నిలిచింది. హైడ్రాలిక్‌ సిస్టమ్‌లో సమస్య ఉత్పన్నం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని నాసా పేర్కొన్నది. 

Tags:    
Advertisement

Similar News