కోడి పందేల కేసులో పోచంపల్లికి నోటీసులు

శుక్రవారం విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్న మొయినాబాద్‌ పోలీసులు;

Advertisement
Update:2025-03-13 10:44 IST

 ఫామ్‌హౌస్‌లో కోడి పందేల కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికి మరోసారి మొయినాబాద్‌ పోలీసులు నోటీసులు ఇచ్చారు. శుక్రవారం విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు. ఈ మేరకు మాదాపూర్‌లోని ఆయన నివాసానికి వెళ్లి నోటీసులు అంటించారు. గత నెలలో తోల్కట్టలోని ఫామ్‌హౌస్‌లో భారీగా కోడి పందేలు, కేసినో నిర్వహించారు. ఈ ఘటనలో మొత్తం 64 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫామ్‌హౌస్‌ యజమాని పోచంపల్లిని కూడా నిందితుడిగా చేర్చారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 13న మొయినాబాద్‌ పోలీసులు మొదటిసారి ఆయనకు నోటీసులు ఇచ్చారు. 

Tags:    
Advertisement

Similar News