రెండోరోజు కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాలు

శాసనసభలో కొనసాగుతున్న గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ;

Advertisement
Update:2025-03-13 10:30 IST

బడ్జెట్‌ అసెంబ్లీ సమావేశాలు నేడు రెండోరోజు కొనసాగుతున్నాయి. బుధవారం ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతున్నది. ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ప్రతిపాదించగా.. నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం ఈ తీర్మానాన్ని బలపరిచారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే తీర్మానంపై చర్చ శనివారం కూడా కొనసాగనున్నది. అదే విధంగా బుధవారం రోజున బీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సీఎం రేవంత్‌ రెడ్డి సభ ముందుకు తీసుకొచ్చారు. పంచాయతీరాజ్‌ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క తెలంగాణ వాటర్‌ సప్లై కార్పొరేషన్‌ లిమిటెడ్‌ 5,6,7 వార్షిక నివేదికల ఖాతాల కాపీని సభలో పెట్టారు. అదేవిధంగా పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ నోటిఫికేషన్‌ కాపీని మంత్రి సీతక్క సభ ముందు పెట్టారు.


Tags:    
Advertisement

Similar News