సీఎం రేవంత్‌రెడ్డిని మెంటల్ ఆసుపత్రికి చేర్చాలి : కేటీఆర్

సీఎం రేవంత్ లాంటి వ్యక్తిని మెంటల్ ఆసుపత్రికి చేర్చాలని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు;

Advertisement
Update:2025-03-12 20:42 IST

ప్రతిపక్షాల మరణం కోరుకోవటం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీచబుద్దికి పరాకాష్ఠ అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యల పట్ల మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఖండించారు. ఈ పిచ్చి కుక్కమర్యాదకు ఉండే అన్ని పరిమితులను దాటి ప్రవర్తిస్తుందని అన్నారు. అలాగే ఆయనను వీలైనంత త్వరగా మెండల్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని లేకపోతే చుట్టుప్రక్కల వారికి అతని కుటుంబ సభ్యులను అభ్యర్థిస్తున్నాను అంటూ.. లేకుంటే నిరుత్సాహ స్థితిలో చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరినీ కరుస్తాడని కేటీఆర్ పేర్కొన్నారు.

అంతేగాక చీప్ మినిస్టర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని బీఆర్ఎస్ నేత రాసుకొచ్చారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జూనియర్ లెక్చరర్లకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాకు స్ట్రేచర్ ఉందని వీర్రవీగారని, ఇకనైనా ఆ వైఖరి మార్చుకోవాలని అన్నారు. అంతేగాక స్ట్రేచర్ ఉందని విర్రవీగితే స్ట్రెచ్చర్ మీదికి పంపించారని, ఇలాగే ఉంటే రేపు మార్చురీకి పోవాల్సి వస్తుందని గుర్తుపెట్టుకోవాలని కేసీఆర్ ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. 

Tags:    
Advertisement

Similar News