సీఎం రేవంత్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత ఫైర్

బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు పట్లా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.;

Advertisement
Update:2025-03-12 21:33 IST

మాజీ సీఎం కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు పట్లా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమ నేత, ప్రజా నాయకుడు, గౌరవనీయులు అయిన కేసీఆర్ ను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు ఆక్షేపణీయం అని కవిత విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు.

మానవత్వంలేని సీఎం రేవంత్ తన వైఖరి మార్చుకోవాలని కవిత హితవు పలికారు. ఇటువంటి దుశ్చర్యను తెలంగాణ సమాజం గమనిస్తోందని, సమయం వచ్చినప్పుడు మీకు ఇంతకింత శాస్తి జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వీడియోను కూడా కవిత పంచుకున్నారు. పొలిటికల్ మెచూరిటీ లేకనే సీఎం మార్చురీ వ్యాఖ్యలు చేసారు. ప్రతిపక్ష నేతల మరణాన్ని కోరుకుంటున్న నీచ బుద్ది రేవంత్ రెడ్డి ది అని హరీష్ రావు అన్నారు. 

Tags:    
Advertisement

Similar News