హైదరాబాద్ మాజీ క్రికెటర్ మృతి పట్ల కేటీఆర్ విచారం
హైదరాబాద్ మాజీ క్రికెటర్ సయ్యద్ అబిద్ అలీ మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు;
Advertisement
భారత మాజీ క్రికెటర్ సయ్యద్ అబిద్ అలీ మృతి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ట్విట్టర్ లో అలీ ఫోటోను షేర్ చేస్తూ.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనిపై కేటీఆర్.. నిజమైన హైదరాబాదీ క్రికెట్ లెజెండ్ సయ్యద్ అబిద్ అలీ సాబ్ మృతికి హృదయపూర్వక సంతాపం తెలియజేశారు. క్రికెట్ పై అభిరుచితో ఆడిన ఆల్ రౌండర్ అతడని కొనియాడారు. అంతేగాక అతను భారత క్రికెట్‌పై శాశ్వతమైన ముద్ర వేశారని చెప్పారు.
ఇక ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ.. అబిద్ అలీ ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థించారు. కాగా భారత దిగ్గజ మాజీ క్రికెటర్ సయ్యద్ అబిద్ అలీ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుది శ్వాస విడిచారు
Advertisement