ఏపీలో ఎన్నికల సంఘం అనూహ్య నిర్ణయం....

ఆంధ్రప్రదేశ్‌లో దొంగ ఓట్ల వ్యవహారంపై రచ్చ జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రధానాధికారి సిసోడియాపై బదిలీ వేటు వేసింది. ఏపీలో ఏకంగా 52 లక్షల 67 వేల దొంగ ఓట్లు చేరాయన్నది వైసీపీ ప్రధాన ఆరోపణ. వీటిని తొలగించాలంటూ ఎన్నికల సంఘానికి వైసీపీ పలుమార్లు ఫిర్యాదు చేసింది. అయితే ఏపీలో ఎన్నికల ప్రధానాధికారిగా ఉన్న సిసోడియా మాత్రం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో కేంద్ర ఎన్నికల […]

Advertisement
Update:2019-01-17 14:04 IST

ఆంధ్రప్రదేశ్‌లో దొంగ ఓట్ల వ్యవహారంపై రచ్చ జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రధానాధికారి సిసోడియాపై బదిలీ వేటు వేసింది.

ఏపీలో ఏకంగా 52 లక్షల 67 వేల దొంగ ఓట్లు చేరాయన్నది వైసీపీ ప్రధాన ఆరోపణ. వీటిని తొలగించాలంటూ ఎన్నికల సంఘానికి వైసీపీ పలుమార్లు ఫిర్యాదు చేసింది.

అయితే ఏపీలో ఎన్నికల ప్రధానాధికారిగా ఉన్న సిసోడియా మాత్రం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో కేంద్ర ఎన్నికల సంఘానికి వైసీపీ ఫిర్యాదు చేసింది.

ఎలాంటి పరిశీలన చేయకుండా అధికార పార్టీకి అనుకూలంగా, ప్రతిపక్షాలకు చెందిన ఓట్లను తొలగిస్తున్నారని ఆధారాలతో సహా సీఈసీకి ఫిర్యాదు చేసింది.

సిసోడియా పూర్తిగా అధికార టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారంటూ పలు ఆధారాలను కూడా వైసీపీ అందజేసింది.

ఈ నేపథ్యంలో ఏపీ ఎన్నికల ప్రధానాధికారిగా ఉన్న సిసోడియాపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ఆయన స్థానంలో గోపాలకృష్ణ ద్వివేదిని నియమించింది. తక్షణం తమ ఆదేశాలు అమలులోకి వస్తాయని ప్రకటించింది.

కొత్తగా వచ్చిన ఎన్నికల ప్రధానాధికారి ఎన్నికల విధులు తప్ప…. ఏపీ ప్రభుత్వానికి సంబంధించి మరే ఇతర బాధ్యతలు స్వీకరించబోరని స్పష్టం చేసింది.

Tags:    
Advertisement

Similar News