బావర్చి హోటల్ ను సీజ్ చేసిన జీహెచ్ఎంసీ

బిర్యానీకి మారు పేరుగా నిల్చిన బావర్చీ హోటల్‌ను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) అధికారులు సీజ్ చేశారు. హోటల్‌లో వెలువడే వ్యర్థపదార్థాలను నిర్వాహకులు సరిగా వేరు చేయడం లేదని.. తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరు చేయకుండా తరలిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ సర్కిల్ 15 ఏఎంహెచ్‌వో డాక్టర్ హేమలత నేతృత్వంలో సోమవారం తనిఖీలు చేపట్టారు. గతంలోనే ఆర్గానిక్ వేస్ట్ కన్వర్టర్ యంత్రాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించినా హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యం చేసింది. […]

Advertisement
Update:2019-01-07 14:06 IST

బిర్యానీకి మారు పేరుగా నిల్చిన బావర్చీ హోటల్‌ను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) అధికారులు సీజ్ చేశారు. హోటల్‌లో వెలువడే వ్యర్థపదార్థాలను నిర్వాహకులు సరిగా వేరు చేయడం లేదని.. తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరు చేయకుండా తరలిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ సర్కిల్ 15 ఏఎంహెచ్‌వో డాక్టర్ హేమలత నేతృత్వంలో సోమవారం తనిఖీలు చేపట్టారు. గతంలోనే ఆర్గానిక్ వేస్ట్ కన్వర్టర్ యంత్రాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించినా హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యం చేసింది. హోటల్ వ్యర్థాలను మ్యాన్ హోల్స్‌లోకి వదులుతున్నారని జలమండలి నుంచి కూడా పిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ విషయంపై 2016లోనే నోటీసులు అందించారు.

రెండేళ్ల నుంచి వేస్ట్ మేనేజ్‌మెంట్‌పై నోటీసులు అందుకున్నా…. స్పందించక పోవడంతో ఇవాళ బావర్చి హోటల్‌ను సీజ్ చేశారు. పక్కనే ఉన్న ఆస్టోరియాతో పాటు మరో రెండు హోటళ్లకు నోటీసులు జారీ చేశారు.

ఆర్టీసీ క్రాస్ రోడ్డు ప్రాంతంలో నిత్యం సందడిగా కనిపించే బావర్చి ఇవాళ మూసి వేసి ఉండటం అటువైపు వెళ్లిన వారిని ఆశ్చర్యపరిచింది. మరోవైపు ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ కూడా బావర్చి నుంచి పదార్థాలు డెలివరీ ఆపేసినట్లు వినియోగదారులకు మెసేజ్ చేశాయి.

Tags:    
Advertisement

Similar News