బలప్రదర్శనకు సిద్ధమవుతున్న జలీల్ ఖాన్
బీకాంలో ఫిజిక్స్ డైలాగ్తో ఆగమైపోయిన విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ బలప్రదర్శనకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం అనుమానంగా కనిపిస్తుండడంతో పార్టీపై ఒత్తిడి పెంచేందుకు శ్రీకారం చుట్టారు జలీల్ ఖాన్. తనకు కాకపోయినా తన కుమార్తెకైనా టికెట్ ఇవ్వాల్సిందేనని జలీల్ ఖాన్ పట్టుపడుతున్నారు. టికెట్ రాకపోవచ్చు అన్న విషయాన్ని నేరుగా చంద్రబాబు చెప్పకుండానే… పలు సర్వేల్లో తీవ్ర ప్రజావ్యతిరేకత ఉందన్న విషయాన్ని ఇతర మార్గాల్లో జలీల్ ఖాన్కు తెలిసేలా చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకే […]
బీకాంలో ఫిజిక్స్ డైలాగ్తో ఆగమైపోయిన విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ బలప్రదర్శనకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం అనుమానంగా కనిపిస్తుండడంతో పార్టీపై ఒత్తిడి పెంచేందుకు శ్రీకారం చుట్టారు జలీల్ ఖాన్. తనకు కాకపోయినా తన కుమార్తెకైనా టికెట్ ఇవ్వాల్సిందేనని జలీల్ ఖాన్ పట్టుపడుతున్నారు. టికెట్ రాకపోవచ్చు అన్న విషయాన్ని నేరుగా చంద్రబాబు చెప్పకుండానే… పలు సర్వేల్లో తీవ్ర ప్రజావ్యతిరేకత ఉందన్న విషయాన్ని ఇతర మార్గాల్లో జలీల్ ఖాన్కు తెలిసేలా చేస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో తనకే టికెట్ ఇవ్వాలని, అలా కానీ పక్షంలో తన కుమార్తెకు అవకాశం ఇవ్వాలని జలీల్ ఖాన్ కోరినా చంద్రబాబు నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ రాలేదు. దీంతో బలప్రదర్శనకు సిద్ధమయ్యారు. తన పుట్టిన రోజును జక్కంపూడిలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ పెద్దలతో పాటు మతపెద్దలను, కార్యకర్తలను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు. పుట్టిన రోజు వేడుకల సందర్భంగా అందరి సమక్షంలో తన కుమార్తెను రాజకీయ వారసురాలిగా పరిచయం చేయాలని జలీల్ ఖాన్ భావిస్తున్నారు.
విజయవాడ పశ్చిమ టికెట్ కోసం కొరపాటి జగన్ అనే నాయకుడు కూడా ప్రయత్నాలు చేస్తుండడం జలీల్ ఖాన్కు రుచించడం లేదు. కొరపాటి తనదైన శైలిలో టీడీపీ పెద్దలకు దగ్గరవుతున్నారు. జలీల్ ఖాన్ మాత్రం అల్లుకుపోవడంలో వెనుకబడుతున్నారు. సొంత సామాజికవర్గం వారే జలీల్ ఖాన్ను వ్యతిరేకిస్తున్నారు.
పార్టీ మారడం ద్వారా మైనార్టీల పరువు తీయడమే కాకుండా… అహంభావంతో జలీల్ ఖాన్ ప్రవర్తిస్తున్నారని పలువులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాలన్నీ తెలిసే చంద్రబాబు జలీల్ ఖాన్కు టికెట్ ఇచ్చేందుకు విముఖంగా ఉన్నారని చెబుతున్నారు.
ఇప్పటికే మూడుసార్లు పార్టీలు మారిన జలీల్ ఖాన్ ఇప్పుడు మరో పార్టీలోకి వెళ్లే అవకాశం లేదు. దీంతో జలీల్ ఖాన్ను చంద్రబాబు లైట్ తీసుకుంటున్నారు.