లాడ్జీలో పట్టుబడ్డ గుంటూరు టీడీపీ కార్యకర్తలు

హైదరాబాద్‌ సనత్‌నగర్‌ నియోజకవర్గంలోని అమీర్‌పేట్‌లో రాత్రి ఉద్రిక్తత ఏర్పడింది. ఓటర్లకు టీడీపీ కార్యకర్తలు డబ్బులు పంచేందుకు రావడంతో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అడ్డుకున్నారు. టీడీపీ కార్యకర్తలను తరిమేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో స్థానిక ఎస్‌ఐ టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు అడ్డుపడడంతో ఆయనపై దాడి చేశారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ అనుచరులే తమపై దాడి చేశారని టీడీపీ కార్యకర్తలు చెబుతున్నారు. డబ్బులు పంచుతుంటే చూస్తూ ఊరుకోవాలా అని టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు టీడీపీ […]

Advertisement
Update:2018-12-03 03:19 IST

హైదరాబాద్‌ సనత్‌నగర్‌ నియోజకవర్గంలోని అమీర్‌పేట్‌లో రాత్రి ఉద్రిక్తత ఏర్పడింది. ఓటర్లకు టీడీపీ కార్యకర్తలు డబ్బులు పంచేందుకు రావడంతో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అడ్డుకున్నారు.

టీడీపీ కార్యకర్తలను తరిమేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో స్థానిక ఎస్‌ఐ టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు అడ్డుపడడంతో ఆయనపై దాడి చేశారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ అనుచరులే తమపై దాడి చేశారని టీడీపీ కార్యకర్తలు చెబుతున్నారు.

డబ్బులు పంచుతుంటే చూస్తూ ఊరుకోవాలా అని టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు టీడీపీ కార్యకర్తలు బస చేసిన లాడ్జీలో సోదాలు నిర్వహించారు. సోదాలు చేస్తున్న సమయంలో లాడ్జీలో ఉన్న నలుగురు టీడీపీ కార్యకర్తలు డబ్బుతో పట్టుబడ్డారు.

పట్టుబడిన టీడీపీ కార్యకర్తలను గుంటూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. నగరంలో పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థుల తరపున కార్యక్రమాలు చక్కబెట్టేందుకు వీరు వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. టీడీపీ కార్యకర్తల నుంచి ఓటర్లకు పంచేందుకు సిద్ధంగా ఉంచిన నాలుగు లక్షల 63వేల నగదు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు.

Tags:    
Advertisement

Similar News