నేను జగన్‌కు మీడియేటర్ ని కాదు

విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపనందేంద్ర దగ్గరకు జగన్‌ను తీసుకెళ్లింది తానేనన్న వార్తల్లో నిజం లేదన్నారు కాంగ్రెస్ ఎంపీ సుబ్బరామిరెడ్డి. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన… రాజకీయనాయకులు ఏదైనా పనిచేయాలంటే దైవశక్తి అవసరమని ఆ ఉద్దేశంతో స్వరూపనందేంద్రే స్వయంగా జగన్‌కు ఆహ్వానం పంపారని చెప్పారు. జగన్‌ వచ్చిన రోజు తాను యాదృచ్చికంగానే అక్కడికి వచ్చానన్నారు. ఆ రోజు తాను జగన్ రహస్యాలేమీ మాట్లాడుకోలేదన్నారు. వైసీపీ నుంచి ఇప్పటికే ఆఫర్ సిద్ధమైందన్న వార్తలను సుబ్బరామిరెడ్డి తోసిపుచ్చారు. అవన్నీ మీడియాలో జరుగుతున్న ప్రచారం […]

Advertisement
Update:2016-08-17 15:10 IST

విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపనందేంద్ర దగ్గరకు జగన్‌ను తీసుకెళ్లింది తానేనన్న వార్తల్లో నిజం లేదన్నారు కాంగ్రెస్ ఎంపీ సుబ్బరామిరెడ్డి. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన… రాజకీయనాయకులు ఏదైనా పనిచేయాలంటే దైవశక్తి అవసరమని ఆ ఉద్దేశంతో స్వరూపనందేంద్రే స్వయంగా జగన్‌కు ఆహ్వానం పంపారని చెప్పారు. జగన్‌ వచ్చిన రోజు తాను యాదృచ్చికంగానే అక్కడికి వచ్చానన్నారు. ఆ రోజు తాను జగన్ రహస్యాలేమీ మాట్లాడుకోలేదన్నారు.

వైసీపీ నుంచి ఇప్పటికే ఆఫర్ సిద్ధమైందన్న వార్తలను సుబ్బరామిరెడ్డి తోసిపుచ్చారు. అవన్నీ మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రమేనన్నారు. తనకు ఇంకా నాలుగేళ్లు రాజ్యసభ పదవి ఉందని కాబట్టి కాంగ్రెస్‌ను వీడి వెళ్లి 2019లో మరో పార్టీ నుంచి పోటీ చేయాల్సిన అవసరం లేదన్నారు. అసలు 2019 ఇంకా మూడేళ్లు ఉందని… ఇప్పటి నుంచే ఆలోచిస్తే జుట్టు ఊడిపోతుందన్నారు. మూడేళ్ల ముందే 2019 ఎన్నికల గురించి ఆలోచించడం సరికాదన్నారు.

భవిష్యత్తులో కాంగ్రెస్‌, వైసీపీ కలిసి పనిచేస్తే తప్పేంటని సుబ్బరామిరెడ్డి ప్రశ్నించారు. బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేయడం లేదా అని అన్నారు. పొగడ్తలకు సంతోషించని మనిషి ఎవరూ ఉండరన్నారు. విశాఖ తనదేనంటూ పురందేశ్వరి పోటీకి వచ్చారని ఆ సమయంలో కొంచెం విబేధాలు వచ్చాయన్నారు. కానీ అందంతా దైవ నిర్ణయమని చెప్పారు. అందుకే పురందేశ్వరి ఓడిపోయారని… తాను మాత్రం ఇప్పటికీ ఎంపీగా కొనసాగుతున్నానని చెప్పారు. ఇంతకు మించి దైవం తనకు ఇవ్వాల్సింది ఏమీ లేదన్నారు. జీవితంలో తన ద్వారా వీలైనంత ఎక్కువ మందికి మంచి జరిగితే అదే చాలన్నారు సుబ్బరామిరెడ్డి.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News