రేపు చేవెళ్లలో బీఆర్‌ఎస్ రైతు దీక్ష
పాల్గొననున్న కేటీఆర్, పార్టీ సీనియర్ నేతలు
Advertisement
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వారికి చేసిన మోసాన్ని వివరిస్తూ శుక్రవారం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో చేవెళ్లలో రైతు దీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్ మండల కేంద్రంలో నిర్వహించే ఈ రైతు దీక్షలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పార్టీ ముఖ్యనేతలంతా పాల్గొంటారు. రైతులకు ఎకరానికి ఏడాదికి రూ.15 వేల రైతు భరోసా, కౌలు రైతులకు రైతు భరోసా వర్తింపు, అన్ని పంటలకు, అన్నిరకాల వడ్లకు క్వింటాల్ కు రూ.500 చొప్పున బోనస్, రూ.2 లక్షల వరకు రైతు రుణాలన్నీ మాఫీ సహా రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చకుండా ఎలా మోసం చేసిందో రైతుదీక్ష ద్వారా చాటిచెప్పనున్నారు.
Advertisement