ఎల్లుండి ఏపీ పర్యటనకు అమిత్ షా
రెండు రోజుల పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న కేంద్ర హోం మంత్రి
Advertisement
కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. గన్నవరం సమీపంలోనే ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌ఐడీఎం కొత్త క్యాంపస్ లను ఆయన ఈ పర్యటనలో భాగంగా ప్రారంభించనున్నారు. శనివారం రాత్రి అమిత్ షా ప్రత్యేక విమానంలో గన్నవర్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఉండవల్లిలోని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లారు. అమిత్ షా గౌరవార్థం చంద్రబాబు ఇచ్చే విందులో పాల్గొంటారు. అక్కడి నుంచి విజయవాడలోని ఒక హోటల్ కు చేరుకుని రాత్రి బస చేస్తారు. ఆదివారం ఉదయం 11.15టంటలకు ఎన్‌ఐడీఎం సెంటర్‌ను, ఎన్‌డీఆర్‌ఎఫ్ టెన్త్ బెటాలియన్ ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం ఢిల్లీకి బయల్దేరి వెళ్తారు. అమిత్ షా ఏపీ టూర్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది.
Advertisement