విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్రం ప్రభుత్వం గుడ్ న్యూస్
విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్రం ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
Advertisement
విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్రం ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నష్టాల్లో ఉన్న ఉక్కు పరిశ్రమను మళ్లీ నిలబెట్టేందుకు రూ.11,500 కోట్లతో భారీ ఉద్దీపన ప్యాకేజీకి ఆమోదం తెలిపింది. గురువారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రి వర్గం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
ఉక్కు పరిశ్రమకు సంబంధించి ఆపరేషనల్ పేమెంట్స్ కోసం ఈ ప్యాకేజీని వినియోగించనున్నారు. తాజా ఉద్దీపన ప్యాకేజీపై రేపు అధికారిక ప్రకటన వెలువడనుంది. ప్రధాని విశాఖ పర్యాటనలో ఉక్కు పరిశ్రమపై మాట్లాడకపోవడంతో... ప్రైవేటీకరణ ఖాయమేనన్న వాదనలు వినిపించాయి. కానీ, చంద్రబాబు ప్రయత్నాలు ఫలించి కేంద్రం సానుకూల నిర్ణయంతో ఏపీ ప్రజలకు శుభవార్తను వినిపించింది.
Advertisement