జాతీయ గొట్టాలు బాబు చుట్టాలు?

ఉత్తరప్రదేశ్‌లో ఒక మంత్రి కోసం విమానాన్ని అరగంట ఆపారు. తప్పే. అంతే దానిపై ఆరోజంతా బ్రేకింగ్‌లు. సాయంత్రం రెండు మూడు గంటలు చర్చ. ఢిల్లీలో ఒక ట్రాఫిక్ పోలీస్ ఒక పౌరుడిని కొట్టాడు. ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు వేసిన వీడియో వేసి ఉతికేయడం. రాజస్థాన్‌లో ఒక యువతిపై దాడి. జాతీయ స్థాయిలో విషయాన్ని హైలైట్ చేయడం. వంద కోట్ల కుంభకోణం ఏ రాష్ట్రంలోనైనా బయటపడితే ఇక అంతే సంగతులు. ఓ వారం పాటు నిత్య చర్చలు, […]

Advertisement
Update:2016-03-20 15:11 IST

ఉత్తరప్రదేశ్‌లో ఒక మంత్రి కోసం విమానాన్ని అరగంట ఆపారు. తప్పే. అంతే దానిపై ఆరోజంతా బ్రేకింగ్‌లు. సాయంత్రం రెండు మూడు గంటలు చర్చ. ఢిల్లీలో ఒక ట్రాఫిక్ పోలీస్ ఒక పౌరుడిని కొట్టాడు. ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు వేసిన వీడియో వేసి ఉతికేయడం. రాజస్థాన్‌లో ఒక యువతిపై దాడి. జాతీయ స్థాయిలో విషయాన్ని హైలైట్ చేయడం. వంద కోట్ల కుంభకోణం ఏ రాష్ట్రంలోనైనా బయటపడితే ఇక అంతే సంగతులు. ఓ వారం పాటు నిత్య చర్చలు, అనుక్షణం ఫాలోఅప్‌తో స్కాం చేసిన వాడికి చుక్కలు చూపిస్తాయి. ఇలా దేశంలో ఏ రాష్ట్రంలో చీమ చిటుక్కమన్నా జాతీయ మీడియా విజృంభిస్తుంది. సమస్యను జాతీయ స్థాయిలో చూపించి నేరం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునే వరకూ వదిలిపెట్టవు. ఈ విషయంలో జాతీయ మీడియా తీరును స్వాగతించాలి. కానీ తెలుగు రాష్ట్రాల విషయంలో మాత్రం జాతీయ గొట్లాలు అందుకు పూర్తి భిన్నం. ఇక్కడ తప్పులు జరగడం లేదా అంటే. బీహార్‌, యూపీని తలదన్నే రేంజ్‌లోనే సాగుతుంటాయి. కానీ ఒక్క లుక్‌ కూడా వేయరు. ఉదాహరణకు కొన్ని గమనిస్తే…

తెలుగు రాష్ట్రాల్లో జాతీయ మీడియా గుడ్డిదైపోయిందనడానికి పెద్ద నిదర్శనం ఎమ్మెల్యేల కొనుగోళ్లు, అమ్మకాలు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎమ్మెల్యేల కొనుగోళ్లు కూరగాయల వ్యాపారంలా సాగుతోంది. కానీ ఇంత బహిరంగంగా రెండు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు ప్రజాస్వామ్యాన్ని చెరబడుతుంటే ఒక్క జాతీయ మీడియా చానల్ కూడా నోరు విప్పడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో జాతీయ మీడియా ప్రతినిధులు లేరా?. వాళ్లకు ఇక్కడ జరుగుతున్న నీచపరిణామాలు తెలియవా?. లేక తెలిసినా బయటి ప్రపంచానికి తెలియకుండా పెద్దోళ్లు అడ్డుకుంటున్నారా?. రోజాపై ఏడాదిపాటు సస్పెన్షన్‌ను హైకోర్టు రద్దు చేస్తే ఏపీ ప్రభుత్వం మాత్రం అమలు చేయబోమంటోంది. ఇదే ఇంకో రాష్ట్రంలో జరిగి ఉంటే జాతీయ టీవీ యాంకర్లు ఊగిపోతూ…కోర్టులు వర్సెస్ చట్ట సభలు అంటూ గంటలు గంటలు చర్చలు నడిపేవారు. కానీ ఏపీ అసెంబ్లీ పరువు పుట్‌పాత్‌పైకి చేరినా జాతీయ మీడియాకు కనిపించడం లేదు. అసలు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీలో ఏమీ జరిగినా జాతీయ మీడియాకు తప్పుగా అనిపిస్తున్నట్టుగా లేదు.

అమరావతిలో వేల ఎకరాల భూకుంభకోణం జరిగిందని రాష్ట్రంలో రచ్చ జరుగుతుంటే జాతీయ మీడియాలో ఒక్క కథనం కూడా లేదు. ఉంటుందన్న ఆశ కూడా లేదు. జాతీయ మీడియా దౌర్భాగ్యానికి మరో నిదర్శనం ఏమిటంటే. ప్రస్తుతం ఉండవల్లి సమీపంలోని చంద్రబాబు అధికార నివాసం … నిబంధనలను, చట్టాలను తుంగలో తొక్కి కట్టిన అక్రమ కట్టడం అని అందరికీ తెలుసు. కానీ ఓ జాతీయ టీవీ చానల్ మాత్రం అదే అక్రమ కట్టడంలోనే, కృష్ణా నది ఒడ్డున నిలబడి అరగంట ఇంటర్వ్యూ చేసింది. అదే దేశంలో మరో ముఖ్యమంత్రి ఇలా అక్రమ కట్టడంలో నివాసం ఉండి ఉంటే .. ఖాళీ చేసి వెళ్లేవరకు వెంటాడేవి ఈ జాతీయ చానళ్లు.

ఈ విషయంలోనే కాదు ఓటుకు నోటు. దేశంలోనే ఎన్నడూ జరగని విధంగా ఒక ముఖ్యమంత్రి ఆడియో టేపుల సాక్ష్యాలతో దొరికిపోయాడు. మరో రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉంటే నేషనల్ మీడియా సదరు సీఎం రాజీనామా చేసే వరకు వదిలిపెట్టేది కాదు. కానీ బాబు విషయంలో రెండు ఇంటర్వ్యూలు, రెండు చర్చలు పెట్టి చేతులు దులుపుకున్నారు.

బెజవాడ కాల్‌మనీ సెక్స్‌ రాకెట్. దేశంలో ఎక్కడైనా ఒక మహిళపై దారుణం జరిగితేనే రచ్చరచ్చ చేసే జాతీయ మీడియా సామూహికంగా వందలాది మంది మహిళలు కాల్‌మనీ కాటుకు మానం పోగొట్టుకుంటే జాతీయ మీడియా గళమెత్తిన దాఖలాలు లేవు. తెలుగు రాష్ట్రాల్లో 15కు పైగా టీవీ చానళ్లు ఉన్నాయి. కాబట్టి ఇంకా తాము చూపించేందుకు ఏముందని జాతీయ మీడియా అనుకోవచ్చు. కానీ జాతీయ మీడియా చూపించాల్సింది ఆయా రాష్ట్రాల ప్రజలకు కాదు దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రజలకు. అయినా ఇక్కడ రాజ్యమేలుతున్నది లాబీయింగ్ లో ఇంకా రాని కోర్సులు కూడా పూర్తి చేసిన పెద్దోళ్లు కదా… ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News